ఏపీలో ఎన్నికలు జరిగిన ఇరవై నెలలు అవుతోంది.మొత్తం ఐదేళ్లలో 60 నెలల పాలనకు గాను జగన్ ఇప్పటికే 21 నెలల పాలన పూర్తి చేసుకుని 22వ నెలలోకి అడుగు పెట్టారు.
అంటే ఇంకా ఎన్నికలకు మరో 39 నెలల టైం ఉంది.చివరి యేడాదిన్నర మినహా యిస్తే జగన్‌కు గట్టిగా మరో 20 నెలల సమయం మాత్రమే ఉందని చెప్పాలి.
అయితే దేశ వ్యాప్తంగా గత కొంత కాలంగా జమిలీ ఎన్నికల చర్చ ఎక్కువుగా జరుగుతోంది.వాస్తవానికి మోడీ ప్రధాన మంత్రి అయిన తొలి టర్మ్ నుంచే జమిలీ ఎన్నికల చర్చ బాగా నడుస్తోంది.
తాజాగా ఇటీవలే మరోసారి మోడీ నోట జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది.దీంతో చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు జమిలీ ఖాయమే అంటున్నారు.
జమిలీ ఎన్నికలు జరిగితే 2022లో జరిగేందుకే ఎక్కువ ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.సరే జమిలీ ఎన్నికల గోల ఎలా ఉన్నా ఏపీలో జగన్ 20 నెలల పాలన ఎలా ? ఉందని తాజాగా ఓ ఆన్ లైన్ మీడియా సంస్థ సర్వే చేసింది.డిజిటల్ రంగంలో కాస్త పేరున్న ఈ సంస్థ చేసిన సర్వేలో ఏపీ ప్రజలు మరోసారి జగన్‌కే పట్టం కడతారన్నది స్పష్టమైంది.ఈ సర్వేలో జగన్‌కు ఏకంగా 48 శాతం ఓటర్లు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
ఇక టీడీపీ 35 శాతం ఓట్లతో సరిపెట్టుకోనుంది.

టీడీపీకి ఎప్పటి నుంచో సంప్రదాయ బద్ధంగా వస్తోన్న ఆ 30 శాతం ఓటు బ్యాంకుకు అటూ ఇటూగానే మరోసారి ప్రజలు ఓట్లు వేయనున్నారన్నది స్పష్టమైంది.టీడీపీకి, వైసీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం ఏకంగా 13 వరకు ఉంది.ఇది చాలా ఎక్కువనే చెప్పాలి.
ఇక బీజేపీకి, జనసేనకు కలిపి 12 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని సర్వే స్పష్టం చేసింది.ఏదేమైనా మరోసారి జగన్ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తాడని సర్వే కుండబద్దలు కొట్టేసింది.
జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నది క్లీయర్ గా తెలిసిపోతోంది.