వసంత పంచమి నాడు ఈ దేవుళ్లకి కూడా పూజ చేస్తారా..?

మాఘ శుద్ధ పంచమినే వసంత పంచమిగా వ్యవహరిస్తారు.అంతే కాదండోయ్ శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతీ జయంతి అని కూడా అంటారు.

అయితే ఈ ఏడు వసంత పంచమి ఫిబ్రవరి ఐదో తేదీన అంటే రేపే వస్తోంది.రుతు సంబంధమైన పండుగ కావడం వల్ల మాఘ శుద్ధ పంచమికి ఈ పేరు వచ్చింది.

Which God Puja Is Important On Vasantha Panchami, Vasantha Panchami, Pooja ,

అయితే వసంత పంచమి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సరస్వతీ దేవి కానీ వసంత పంచమి నాడు కేవలం సరస్వతీ దేవికే కాకుండా వేరే ఇతర దేవుళ్లకు కూడా పూజలు చేస్తుంటారు.కానీ ఈ విషయం చాలా మందికి తెలీదు.

మరి రేపే వసంత పంచమి కాబట్టి ఏయే దేవుళ్లకు పూజ చేయాలి.ఏ దేవుడిని పూజిస్తే ఏం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వసంత పంచమి నాడే సరస్వతీ దేవి జయంతి కావడంతో ఎక్కువగా ఈ దేవతకే పూజలు చేస్తుంటారు.కానీ మన దేశంలోని పలు ప్రాంతాల్లో రతీ దేవికి, కామ దేవుడుకి, వసంతుడికి కూడా ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

వీరికి పూజలు చేసి దానాలు చేస్తే.వసంతుడు సంతోషిస్తాని మన పురాణాలు చెబుతున్నాయి.

ఇలా రతీ దేవి, మన్మథుడికి పూజలు చేయడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమానుబంధాలు ఏర్పడి.ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారట.

ఎంత డబ్బు ఉన్నా.ప్రేమించే వారు లేకపోతే మన జీవితానికి అర్థమే లేదు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

అందుకే రతీ దేవి, మన్మథులకు వీరితో పాటు జ్ఞానాన్ని పొందేందుకు సరస్వతీ దేవికి శ్రీ పంచమి నాడు పూజలు చేయడం మంచిది.

Advertisement

తాజా వార్తలు