వాట్సాప్ యూజర్లకు శుభవార్త... ప్రైవేట్ న్యూస్‌లెటర్ టూల్ వచ్చేసిందోచ్!

ప్రముఖ దిగ్గజ యాప్ వాట్సాప్( WhastsApp ) మంచి స్పీడుమీద వుంది.రోజుకొక కొత్త అప్డేట్ ఇస్తూ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఎంతలా అంటే ఊపిరి సలపకుండా చేస్తోందని చెప్పుకోవచ్చు.కనీసం రోజుకి ఒక్క అప్డేట్ అయినా ఇస్తోంది.

ఈ క్రమంలోనే ఒకేసారి ఎక్కువమందితో కమ్యూనికేట్ అయ్యేందుకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.మొదట్లో గ్రూప్స్, ఆ తర్వాత కమ్యూనిటీస్ బ్రాడ్‌కాస్టింగ్ ఫీచర్లను( Broadcasting Features ) పరిచయం చేయగా ఇప్పుడు న్యూస్‌లెటర్ పేరుతో కొత్త ఫీచర్ తీసుకొచ్చే పనిలో బిజీ అయిపోయింది.

ఇకపోతే న్యూస్‌లెటర్ అనేది సమాచారాన్ని బ్రాడ్‌కాస్టింగ్ చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడనుంది.స్థానిక అధికారులు, క్రీడా బృందాలు లేదా ఇతర సంస్థలు, గ్రూప్స్‌ నుంచి ఉపయోగకరమైన అప్‌డేట్స్‌ పొందడాన్ని ఇది సులభతరం చేస్తుంది.వ్యాపారాలు, వ్యక్తులు నేరుగా వాట్సాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా న్యూస్‌లెటర్స్‌( Newsletter ) క్రియేట్ చేసి వాటిని పంపించడానికి వీలు పడుతుందన్నమాట.

Advertisement

వాట్సాప్ బీటా ఇన్ఫో(WhatsApp Beta ) ప్రకారం, ప్రైవేట్ న్యూస్‌లెటర్స్‌ క్రియేట్ చేయడానికి యూజర్లకు వీలు కల్పించే కొత్త ఫీచర్‌ను జోడించాలని ప్రస్తుతం కంపెనీ యోచిస్తోంది.

ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధిలో దశలో వుంది.న్యూస్‌లెటర్ ఫీచర్‌(Newsletter Feature )తో యూజర్లు ఇమేజ్‌లు, వీడియోలు, టెక్స్ట్‌తో న్యూస్‌లెటర్స్‌ వంటివి చాలా తేలికగా క్రియేట్ చేసుకోవచ్చు.వినియోగదారులు వివిధ టెంప్లేట్లు, డిజైన్ లను వాడుకొని వారి న్యూస్‌లెటర్ రూపాన్ని మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది.

ఇంకా ఈ ఫీచర్‌తో వినియోగదారులు వారి న్యూస్‌లెటర్స్‌ను నిర్దిష్ట సబ్‌స్క్రిప్షన్ గ్రూప్స్‌కి పంపించుకోవచ్చు.అదేవిధముగా నిర్దిష్ట ప్రేక్షకులకు తమ న్యూస్‌లెటర్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం కూడా ఇక్కడ కుదురుతుంది.

ప్రస్తుతానికి న్యూస్‌లెటర్‌ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది.ఇది యాప్ ఫ్యూచర్‌ అప్‌డేట్‌లో రిలీజ్ కావచ్చు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

అయితే ఎప్పుడనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు