హైబీపీని నిర్ల‌క్ష్యం చేస్తున్నారా..అయితే ఈ జ‌బ్బులు రావ‌డం ఖాయం?

హైబీపీ లేదా అధిక ర‌క్త‌పోటు.నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది ఈ స‌మ‌స్యతో బాధ ప‌డుతున్నారు.

ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి, వ్యాయామాల‌కు దూరంగా ఉండ‌టం, ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, అధిక ఉప్పు వాడ‌కం, జంక్‌ ఫుడ్ తీసుకోవ‌డం, సిగరెట్‌, మద్యపానం ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల అధిక ర‌క్తపోటు స‌మ‌స్య ఏర్ప‌డుతంది.అయితే ఈ స‌మ‌స్య వ‌ల్ల బాధ ప‌డే వారిలో చాలా మంది ఏవో మందులు వాడ‌తారు.

High Blood Pressure, Bp, High Bp Blood Pressure, Health Tips, Good Health, Lates

కానీ, త‌గిన జాగ్ర‌త్త‌లు మాత్రం తీసుకోరు.నిజానికి అధిక ర‌క్త‌పోటు అనేది వ్యాధి కాన‌ప్ప‌టికీ.

దాన్ని నిర్ల‌క్ష్యం చేస్తే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ముఖ్యంగా అధిక రక్తపోటు ఎక్కువ కాలం కొనసాగితే.

Advertisement

శరీరంలోని ముఖ్య అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బ తింటుంది.అంతేకాదు, అధిక ర‌క్త పోటును నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల కిడ్నీ ఫెయిల్యూర్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండె పోటు, పక్షవాతం, చూపు స‌న్నగిల్ల‌డం ఇలాంటి జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు పెరిగిపోతాయి.

అందుకే అధిక ర‌క్త పోటు అనేది చాలా ప్రమాదకరమైన‌ది.కాబ‌ట్టి, అధిక ర‌క్త పోటు స‌మ‌స్య ఉన్న వారు మందులు వాడ‌ట‌మే కాదు.

ప‌లు జాగ్ర‌త్తలు కూడా తీసుకోవాలి.ముఖ్యంగా తీసుకునే ఆహారంలో అన్ని పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి.

ఆకు కూరలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.అదే స‌మ‌యంలో ఉప్పు మ‌రియు కొవ్వు అధికంగా ఉండే ఆహారాల‌ను ఎవాయిడ్ చేయాలి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఇక ‌ప్ర‌తి రోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలి.వీలైనంత వ‌ర‌కు ఒత్తిడికి దూరంగా ఉంటూ ప్ర‌శాంత జీవితాన్ని గ‌డ‌పాలి.

Advertisement

అలాగే మ‌ద్యం, స్మోకింగ్ అల‌వాట్లకు దూరంగా ఉండాలి.అధిక ర‌క్త పోటు ఉన్న వారు అధిక బ‌రువును ఖ‌చ్చితంగా నియంత్రించుకోవాలి.

కేఫినేటెడ్ పానీయాలు వల్ల ర‌క్త పోటు అధికంగా ఉంటుంది.అందువ‌ల్ల.

కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.ఇక త‌ర‌చూ బీపీని చెక్ చేసుకుంటూ కూడా ఉండాలి.

తాజా వార్తలు