పాలిచ్చే త‌ల్లులు క్యాబేజీ తింటే ఏం అవుతుందో తెలుసా?

సాధార‌ణంగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో తీసుకునే ఆహారం విష‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తారో.ప్ర‌స‌వం త‌ర్వాత కూడా ఎన్నో ఆహార నియ‌మాలు పాటిస్తారు.

ప్ర‌స‌వం త‌ర్వాత బిడ్డ‌కు త‌ల్లి బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సి ఉంటుంది.అందువ‌ల్ల‌, బిడ్డ‌కు మంచి పోష‌కాలు అందాలంటే.

త‌ల్లి ఖ‌చ్చితంగా పోష‌కాహారం తీసుకోవాలి.అలాగే బిడ్డ పెరిగే కొద్ది.

వారికి ఎక్కువ పాలు అవ‌స‌రం.అయితే త‌ల్లి తీసుకునే ఆహారంపైనే పాల ఉత్ప‌త్తి కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.

Advertisement

అందుకే, పాలు ప‌డే ఆహారాలు తీసుకోమ‌ని పెద్ద‌లు, వైద్యులు త‌ర‌చూ చెబుతుంటారు.అయితే పాలు ఉత్ప‌త్తి పెంచే ఆహారాల్లో క్యాబేజీ కూడా ఒక‌టి.

సాధార‌ణంగా ఎక్కువ శాతం మంది క్యాబేజీని తినేందుకు ఇష్ట ప‌డ‌రు.కానీ, క్యాబేజీలో ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి.

విటమిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, రిబోఫ్లేవిన్, ఫోలేట్, బీటా కెరోటిన్, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు క్యాబేజీలో దాగి ఉంటాయి.అందువ‌ల్ల, క్యాబేజీని డైట్‌లో చేర్చుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించుకోవ‌చ్చు.

ముఖ్యంగా బ్రెష్ట్ ఫీడ్ చేసే మ‌హిళ‌లు త‌మ డైట్‌లో క్యాబేజీ ఉండేలా చూసుకోవాలి.ఇలా చేస్తే పాలు ఉత్ప‌త్తి పెరుగుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మ‌రియు త‌ల్లికి, బిడ్డ‌కు ఎన్నో పోష‌కాలు కూడా అందుతాయి.అలాగే ప్ర‌స‌వ‌తం త‌ర్వాత బ‌రువు త‌గ్గేందుకు చాలా ప్ర‌య‌త్నిస్తుంటారు.

Advertisement

అయితే బ‌రువు త‌గ్గించ‌డంలోనూ క్యాబేజీ ఉప‌యోగ‌ప‌డుతుంది.క్యాబేజీలో కేల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

అందువ‌ల్ల, క్యాబేజీ తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.అయితే మంచిది క‌దా అని క్యాబేజీని పాలిచ్చే త‌ల్లులు అతిగా మాత్రం తీసుకోరాదు.కేవ‌లం వారానికి ఒక‌టి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి.

లేదంటే ఒళ్లు నొప్పులు మ‌రియు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.ఇక క్యాబేజీ ఉడికించి తీసుకోవాలి.

మ‌రియు క్యాబేజీని వండుకునే ముందు ఉప్పు నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

తాజా వార్తలు