రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు ఆసాములకు సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్.
ఆసాములకు 10 శాతం రావాల్సిన యారాన్ సబ్సిడీనీ వెంటనే అమలు చేయాలి.కార్మికులకు కూలీ ఒప్పందం ప్రకారం పెంచిన కూలి రేట్లు ఇవ్వాలి.
ప్రతి నేత కార్మికునికి నెలకు 23 వేల జీతం రావాలి.నేత కార్మికులు సుఖశాంతులతో వర్ధిల్లుతారని తెలంగాణ ప్రాంతం మొత్తం అనుకుంటుంది.
కానీ చేనేత కార్మికులకు ఆసాములకు కూలీ గిట్టుబాటు కావడం లేదు.మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి, ఒప్పందం ప్రకారం పెంచిన కూలీ విధానాన్ని అమలు చేయాలి.
నేత కార్మికుల పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కారు.ఐదు సంవత్సరాల క్రితం కూలీ ఏదైతే ఉందో ఇవాళ కూడా అదే ఉంది.







