Tollywood Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడటానికి కారణం రాజమౌళి …కాదంటారా..?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచంలోని నలుమూలలకు తీసుకెళ్లిన ఘనత రాజమౌళి( Rajamouli )కి దక్కింది.కానీ అదే రాజమౌళి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పడుతున్న బాధలకు కారకుడు అంటే అందరూ ఒప్పుకుంటారా.

? అదేంటండీ.రాజమౌళి లాంటి ఒక గొప్ప దర్శకుడిని అంత మాట అనేశారు అని అనుకుంటారేమో.

కానీ అదే పచ్చి నిజం.ఒక సినిమా తీయడానికి బడ్జెట్ నిర్ణయిస్తారు కానీ రాజమౌళి తీసే సినిమాలకు బడ్జెట్ ఎంత ఉంటుందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి.

ఆయన మొదటి సినిమా బడ్జెట్ కి ఇప్పుడు తీసిన సినిమా బడ్జెట్ కి సంబంధం లేదు.రాజమౌళి సినిమా తీయాలంటే మినిమం ఆరు లేదా ఏడు వందల కోట్లు కావాలి.

Advertisement

మరి అన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టిన తర్వాత రిటర్న్స్ వేల కోట్లు కావాలి.

అక్కడే వచ్చింది అసలు చిక్కు.అలా వేలకోట్ల రిటర్న్స్ కావాలి అంటే ఆ సినిమాను అన్ని కోట్లు పెట్టి కొనే డిస్ట్రిబ్యూటర్స్ కావాలి.మరి రాజమౌళి లాంటి దర్శకుడు సినిమా కాబట్టి కొంటారు కానీ రాజమౌళి పే( Rajamouli )రు చెప్పుకొని అనేక మంది ప్యాన్ ఇండియా సబ్జెక్టు( Pan India subject ) లేదా స్టార్ హీరో సినిమా అంటూ వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారు.

దానివల్ల పాన్ ఇండియా సినిమాలు పెరిగాయి, స్టార్ హీరోల రేంజ్ పెరిగింది, అమాంతం వారి పారితోషకాలు ఆకాశాన్ని అంటుకున్నాయి.అవన్నీ కవర్ చేసే ప్రయత్నంలో డిస్టిబూటర్స్( distributors ) పై ఒత్తిడి పడుతుంది.

ఆ సినిమాపై డబ్బు సంపాదించాలి అంటే డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఏరియాకు పెట్టే డబ్బులే మూలాధారం.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

అలా డిస్ట్రిబ్యూటర్స్ రాజమౌళి కారణంగా లేదంటే అలాంటి భారీ బడ్జెట్ సినిమాల కారణంగా నలిగిపోతున్నారు.కొనలేక అమ్మలేఖ ఇబ్బందులు పడుతున్నారు.ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఆ సినిమాను కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది.

Advertisement

చాలా పెద్ద బడ్జెట్ చిత్రాలు కూడా దారుణంగా డిజాస్టర్ ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు బయ్యర్లు.ఇది ఇలాగే కొనసాగితే డిస్ట్రిబ్యూషన్ రంగం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది అని భయపడుతున్నారు.

స్టార్ హీరోల సినిమాల పరిస్థితే ఇలా ఉంది.కానీ మీడియం రేంజ్ సినిమా పరిస్థితి మరోలా ఉంది.

ఆ సినిమాలకు బడ్జెట్ పెట్టే నాధుడు లేడు.చిన్న సినిమాలను రిలీజ్ చేసే నాధుడు లేడు.

ఇలా ప్రతి ఇండస్ట్రీ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది.వీటన్నింటికీ మూలం రాజమౌళి అంటాను .కాదు అనే దమ్ము ఎంతమందికి ఉంది.

తాజా వార్తలు