పరగడుపున మెంతులను తింటే ఏమవుతుందో తెలుసా?     2018-05-01   00:27:34  IST  Lakshmi P

పురాతన కాలం నుండి మెంతులు మన వంటింటిలో ముఖ్యమైన దినుసుగా ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయి. ముఖ్యంగా మెంతులను వంటల్లో రుచి,సువాసన కోసం వేస్తూ ఉంటాం. అయితే మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు మెత్తని పేస్ట్ గా తయారుచేసుకొని పరగడుపున తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మెంతులు మధుమేహం ఉన్నవారికి గొప్ప దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ప్రతి రోజు క్రమం తప్పకుండ ఉదయం పరగడుపున మెంతుల పేస్ట్ తింటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. దాంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

పాలిచ్చే తల్లులు మెంతుల పేస్ట్ తింటే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.