చంద్రబాబు అరెస్టుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా రియాక్షన్

ఏపీలోని టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీఎంసీ పార్టీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.

చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కక్ష సాధింపులా ఉందని తెలిపారు.

చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తీరు సరికాదని మమతా బెనర్జీ తెలిపారు.టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే మాట్లాడాలన్నారు.

అనంతరం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని పేర్కొన్నారు.అంతేకానీ కక్ష పూరితంగా వ్యవహారించడం పద్ధతి కాదని వెల్లడించారు.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు