పుష్పరాజ్ రాకకు టైం ఫిక్స్.. అఫిషియల్ అనౌన్స్ మెంట్!

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ”పుష్ప ది రూల్”( Pushpa The Rule ) ఒకటి.పాన్ ఇండియన్ దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో పుష్ప టాప్ లో ఉంది అని చెప్పాలి.

 Allu Arjun Pushpa The Rule Release Date Fix Details, Pushpa The Rule, Pushpa 2,-TeluguStop.com

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప.ఈ సినిమా పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో పార్ట్ 2పై అన్ని అంచనాలు పెరిగాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు.

ఈసారి సౌత్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా షూట్ సగానికి పైగానే పూర్తి అయ్యింది.

స్టార్ట్ చేయడం లేట్ అయినప్పటికీ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

మరి అంత షూట్ పూర్తి చేసిన రిలీజ్ డేట్ పై( Pushpa 2 Release Date ) ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది.స్వయంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ ప్రకటించారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.దీంతో ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ కాగా అదిరిపోయే లెవల్లో రెస్పాన్స్ తెచ్చుకుంది.కాగా ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube