పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి ఎదురుదెబ్బ..!!

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

బిజెపి చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల తీసుకుని సంవత్సరం ముందు నుండి పశ్చిమబెంగాల్లో కీలక నేతలు ప్రచారం లో దింపిన గాని మమతాబెనర్జీ కె బెంగాల్ ప్రజలు పట్టం కట్టారు.

అయినా మమతా బెనర్జీ గెలిచినా పాలనా పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో బిజెపి పార్టీకి చెందిన నాయకులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.దీనిలో భాగంగా ఇప్పటికే  బిజెపి పార్టీలో కీలక నాయకులు జాయిన్ అవ్వగా మరో కీలక నేత ముకుల్ రాయ్ కూడా తిరిగి టిఎంసి గూటికి చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.గతంలో మమతా బెనర్జీ అత్యంత సన్నిహితుడిగా ఉండే ముకుల్ రాయ్ సరిగ్గా ఎన్నికల ముందు బిజెపి లో జాయిన్ అయ్యారు.

  .కానీ ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మమతా బెనర్జీకి అనుకూలంగా మారటంతో ఆయన మనసు మార్చుకుని తిరిగి సొంతగూటికి చేరుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.దీనిలో భాగంగా త్వరలో మమతాబెనర్జీతో ముకుల్ రాయ్ బేటీ అయ్యి .తృణముల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు అట.

Advertisement
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

తాజా వార్తలు