దారుణ హత్యకు గురైన బీజేపీ కార్యకర్త.. ?

ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడ అల్లర్లు చెలరేగడం, కార్యకర్తల మధ్య హింస చోటు చేసుకోవడం తెలిసిన విషయమే.

ఒక్కోసారి అయితే ప్రాణాలు కూడా పోయే పరిస్దితులు తలెత్తుతాయి.

ఇకపోతే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు.

West Bengal Bjp Activist Mangal Soren Brutally Murdered , West Bengal, Midnapore

మరణించిన అతను 35 ఏళ్ల మంగల్‌ సోరెన్ అని, ఇతను కేశియారీలోని బేగంపూర్‌ ప్రాంతానికి చెందినవాడని సమాచారం.కాగా ఈ రోజు ఉదయం తాను నివాసం ఉంటున్న ఇంటి బయట విగతజీవిగా పడిఉన్న సోరెన్ చూసిన కుటంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారట.

ఇదిలా ఉండగా సోరెన్ ను టీఎంసీ గూండాలే హతమార్చారని బీజేపీ ఆరోపిస్తోంది.ఇక సోరెన్‌ హత్య సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలు ఈ ప్రాంతంలో మోహరించాయి.

Advertisement
ఇది కదరా క్రేజ్ అంటే.. పాకిస్థాన్ బైకులపై '18 విరాట్' (వీడియో)

తాజా వార్తలు