తులసి విత్తనాలతో పెళ్లి పత్రిక.. ఆవును కట్నంగా ఇచ్చి కుమార్తె పెళ్లిని ఘనంగా చేసిన రైతు!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి సంప్రదాయమైన కట్టుబాట్లు ఎక్కడో ఒకచోట ఇంకా మిగిలే వున్నాయి అనే ఆనందం కలగక మానదు.

అవును, తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి.

తన కుమార్తె వివాహాన్ని సాంప్రదాయ బద్దంగా పర్యావరణహితంగా జరిపించి అందరి చేత శెభాష్‌ అనిపించుకున్నారు.సోషల్ మీడియా లేకుంటే ఆ విషయం ఆ వూరి వరకే పరిమితం అయ్యేది.

మంచి విషయం కావడంతో నేడు అది అంతటా ప్రచారం అయ్యింది.దాంతో ఆ రైతుని అందరూ తెగ పొగిడేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, విపుల్‌ పటేల్‌ అనే రైతు సూరత్‌ ప్రాంతానికి చెందిన ఓ మధ్యతరగతి వాడు.ఆమె కుమార్తె పేరు రిద్ధి.

Advertisement

కాగా ఆమె పెళ్లిని అందరిలాగే ఘనంగా చేయాలనుకున్నాడు.అంతేకాకుండా ఆ పెళ్లి ద్వారా ప్రజలకు ఓ సందేశాన్ని కూడా ఇవ్వాలనుకున్నాడు.

అతగాడు బేసిగ్గా ప్రకృతి ప్రేమికుడు.ఇక వివాహ కార్యక్రమంలో భాగమైన ఆహ్వాన పత్రికలను బంధువులకు తులసి విత్తనాల రూపంలో అందించాడు.

అంతటితో ఆగకుండా ఆ విత్తనాలను మట్టిలో నాటి పెంచాల్సిందిగా కోరాడు.

అలాగే వధూవరూలను పెళ్లి సమయంలో ఎడ్ల బండిలోనే మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చాడు.కన్యాదానం చేసేటప్పుడు కూతురికి ఒక గిర్‌ జాతి ఆవును కానుకగా ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.ఇక పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులతోనే వంటకాలు తయారు చేయించి విందును ఏర్పాటు చేయడం ఇక్కడ విశేషతని సంతరించుకుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)

తినే కంచాల నుండి నీళ్ల గ్లాసులు సహా ప్రతి చిన్న విషయంలో అతగాడు తీసుకున్న జాగ్రత్తలు చూసి స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.దాంతో వివాహానికి హాజరైన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు