అమ్మాయి గెటప్ లో అదిరిపోయిన విశ్వక్ సేన్.. లైలా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.

ఈయన హీరోగా ఎన్నో విభిన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విశ్వక్ తాజాగా లేడీ గెటప్( Lady Getup ) లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఇప్పటివరకు ఎన్నో విభిన్న కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన త్వరలోనే లైలా( Laila ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Vishwak Sen Laila First Look Poster Goes Viral Details, Vishwak Sen, Vishwak Sen

రామ్ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం నేడు ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు అనంతరం సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు విడుదల చేశారు.ఈ క్రమంలోనే విశ్వక్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

అయితే ఈ పోస్టర్ లో లేడీ గెటప్ లో కనిపించి విశ్వక్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.ఈ పోస్టర్ లో ఉన్నది విశ్వక్ అని చెప్పే వరకు కూడా అక్కడ ఉన్నది అమ్మాయి కాదు అనే విషయం ఎవరికీ తెలియదు.

Vishwak Sen Laila First Look Poster Goes Viral Details, Vishwak Sen, Vishwak Sen
Advertisement
Vishwak Sen Laila First Look Poster Goes Viral Details, Vishwak Sen, Vishwak Sen

ఇక తాజాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి.ఇక నేడు ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాని 2025 ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఈ సందర్భంగా నిర్మాతలు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు