ఉత్తమ వెబ్ సిరీస్ గా శ్రీకాంత్ చదరంగం

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ప్రస్తుతం కొనసాగుతుంది.గత ఏడాది నుంచి కరోనా ప్రళయం ప్రజలని భయభ్రాంతులకి గురి చేస్తూ ఇల్లు కదలకుండా చేస్తుంది.

ఈ నేపధ్యంలో డిసెంబర్ నుంచి మార్చి వరకు కొంత ఫ్రీం టైం దొరికిందని థియేటర్స్ ఓపెన్ చేసి సినిమాలు ప్రదర్శించారు.అయితే స్టార్ హీరోల సినిమాలకి, అలాగే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న వాటికి తప్ప మిగిలిన సినిమాల వైపు ప్రేక్షకులు పెద్దగా దృష్టి పెట్టలేదు.

బాగుందనే టాక్ వచ్చిన కూడా ఎలాగూ కొద్ది రోజులు ఆగితే ఒటీటీలో వచ్చేస్తుంది అనే ధీమాతో థియేటర్స్ కి వెళ్ళడానికి ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు ఇష్టపడటం లేదు.గతంలో సినిమా హిట్ అయితే ఏ రెండు వారాల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసేవారు.

ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.దీంతో సెలబ్రిటీలు కూడా సినిమాలనే నమ్ముకోకుండా ఆడియన్స్ కి చేరువ కావడం కోసం వెబ్ సిరీస్ ల వైపు వస్తున్నారు.

Advertisement

అలాగే ఒటీటీ చానల్స్ కూడా భారీ బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ లని నిర్మిస్తూ ప్రేక్షకులని తన వైపుకి లాక్కుంటున్నాయి. డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ లతో వెబ్ సిరీస్ లు వస్తూ ఉండటంతో వాటివైపు ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు.

భవిష్యత్తులో పెద్ద సినిమాలకి తప్ప చిన్న సినిమాలని థియేటర్స్ కి వెళ్లి చూసే పరిస్థితి ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉంటే తెలుగులో ఈ మధ్యకాలంలో చాలా వెబ్ సిరీస్ లు వచ్చాయి.

వాటిలో ఇండియన్ వైడ్ గా రీజనల్ వెబ్ సిరీస్ లలో శ్రీకాంత్ నటించిన చదరంగం బెస్ట్ గా నిలిచింది.తాజాగా ఈ బెస్ట్ వెబ్ సిరీస్ జాబితాని ఎనౌన్స్ చేయగా అందులో చదరంగంకి చోటు లభించింది.

మంచు విష్ణు ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు.ఇక రాజ్ అనంత దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

అలాగే శ్రీకాంత్ ఈ వెబ్ సిరీస్ లో డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు