వైరల్ వీడియో... ఈ కుర్రాడు మరో బ్రూస్లీలా ఉన్నాడే

కరాటే అన్నా మార్షల్ ఆర్ట్స్ అన్నా గుర్తొచ్చే పేరు బ్రూస్లీ.బ్రూస్లీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.

ఎందుకంటే సినిమా ఫైట్స్ లో అంటే బ్రూస్ లీ ముందు తరం, బ్రూస్లీ తరువాత తరం అనేంతలా ప్రపంచం మీద తనదైన ముద్ర వేసాడు బ్రూస్ లీ.అయితే ఇక బ్రూస్ లీ ప్రభంజనం తరువాత ఇక ఆ విద్యని నేర్చుకోవడానికి చాలా మంది ముఖ్యంగా చైనీయులు ఆసక్తి చూపించారు.ఇక ఇందులో రకరకాల పంచ్ లను సృష్టించి కరాటేను కొత్త పుంతలు తొక్కించిన బ్రూస్ లీ, ఎన్నో రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే.

Viral Video This Guy Looks Like Another Bruce Lee, Viral Videos, Viral News In

అయితే ప్రస్తుతం ఇప్పుడు అచ్చం బ్రూస్ లీనే చూస్తున్నట్టు ఓ వ్యక్తి అచ్చం బ్రూస్లీ ఉపయోగించే వన్ ఇన్ పంచ్ లను ఊయోగిస్తూ చేసిన ఓ కరాటే విన్యాసం వీడియో ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.అయితే ఈ వీడియోలో ఆ సదరు వ్యక్తి భుజంపై ఓ యువతిని మోస్తూ వన్ ఇన్ పంచ్ తో ఇటుక ముక్కలను అలవోకగా పగలగొట్టాడు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తన అద్భుతమైన కళకు దాసోహమవుతున్నారు.మరల బ్రూస్లీని చూసినట్టుందని, నీ టాలెంట్ అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.నెటిజన్ల కామెంట్స్, షేర్స్, లైక్స్ తో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Advertisement

నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

ఓ లుక్కేయండి మరి.

Advertisement

తాజా వార్తలు