వైరల్ వీడియో : స్టేజిపై స్టెప్పులతో అదరగొట్టిన ఒలంపిక్ పతక విజేత..

నిత్యం సోషల్ మీడియా( Social media )లో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాం.ఏదైనా క్రీడాకారుడు కానీ క్రీడాకారిని గాని వారు విజయం సాధించిన సందర్భంగా డాన్సు స్టెప్స్ వేయడం మనం చూస్తూనే ఉంటాం.

ఈ క్రమంలో తాజాగా ఒలంపిక్ క్రీడలలో విజయం సాధించిన మను భాకర్( Manu Bhaker ) డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.ప్రముఖ స్కూల్లో జరిగిన సాంస్కృతి కార్యక్రమంలో ఆమ పాల్గొని విద్యార్థులతో కలిసి స్టేజిపై డాన్స్ వేసేశారు.అంతేకాకుండా పాఠశాలలో మను భాకర్ కు సత్కారం కూడా చేశారు.

ఈ క్రమంలో మను భాకర్ బాలీవుడ్ సినిమాలోని పాట కాలా చస్మా సాంగ్ ప్లే అవుతుండగా విద్యార్థులతో కలిసి మను భాకర్ డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది.

ఇక ఇప్పటికి ప్యారిస్ లో జరిగిన ఒలంపిక్స్ క్రీడలలో మను భాకర్ 2 పతకాలను సొంతం చేసుకుంది.అలాగే అక్కడి నుంచి ఇండియాకు వచ్చిన అనంతరం అని రాజకీయ పార్టీ నేతలను కలిసి పతకాలను చూపించి మను భాకర్ ప్రశంసలను సొంతం చేసుకుంది.అలాగే ప్రధాని మోడీ( Narendra Modi ), ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, సోనియా గాంధీని కూడా కలిసి ఒలింపిక్స్ విశేషాలు వాళ్ళతో షేర్ చేసుకుంది.

Advertisement

మొన్న ఈ మధ్య భారత్ కు ఒలంపిక్ క్రీడాకారులు తిరిగి వచ్చాక జరిగిన కార్యక్రమంలో భాగంగా ఒలంపిక్ మెడలిస్టు నీరజ్ చోప్రాతో ఆమెకు లవ్ ట్రాక్ నడుస్తుందని అనేక వార్తలు వచ్చాయి.ఈ వార్తలను ఆవిడ ఖండించింది.

ఇకపోతే తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను షూటింగ్ 3 నెలల్లో పక్కన పెట్టేసి., ఈ మూడు నెలల్లో తనకి ఇష్టమైన ఆటలతో ఎంజాయ్ చేస్తానని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు