వైరల్ వీడియో: జోరు వర్షంలో రోడ్డుమీద తడుస్తూ కుక్క.. దాంతో ఆ చిన్నారి ఏం చేసిందంటే..?!

చిన్నారులు అంటే కళ్లాకపటం లేని వారు.నిస్వార్థం తెలియనివారు.

కల్మషం లేనివారు.

అందుకే వారి నవ్వు అందరికీ ఇష్టం.

వాటి మాటలు అందరికీ ముచ్చటగా ఉంటాయి.చిన్నారులు చేసే పనులు ఒక్కోసారి పెద్దల మనసుల్ని కదిలించేస్తాయి.

నిజం చెప్పాలంటే చిన్నారుల ప్రవర్తన పెద్దల మనసును మార్చి, కొత్త జీవితాలకు పునాదులు వేసే అవకాశం కూడా ఇస్తుంటుంది.అందుకే ఓ చిన్నారి చేసిన చిన్న పని చేసినా అందరికీ ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది.

Advertisement

ఇప్పుడు కూడా ఓ చిన్నారి చేసిన పని సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షించింది.చిన్న బాలిక చేసిన ఆ పనితో దయ అనే పదానికి సరైన నిర్వచనాన్ని సూచించింది.

ట్విట్టర్ లో ఇప్పుడొక వీడియో హల్ చల్ చేస్తోంది.వర్షం పడుతుండటంతో రోడ్డుమీద ఒక కుక్క తడిచిపోతోంది.

అక్కడే గొడుగు వేసుకుని ఒక చిన్న పిల్ల నిలుచుని ఉంది.ఆ సమయంలో అక్కడ ఉన్న తదిచిపోతున్న కుక్కను చూసింది.

తన గొడుగు తీసుకెళ్ళి ఆ కుక్కపై వర్షం పడకుండా అడ్డు పెట్టింది.దానిని జాగ్రత్తగా రోడ్డు దాటించి తీసుకువెళ్ళింది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!

అలాగే, ఆ కుక్కను వదిలేయడానికి ఆ చిన్నారి ఒప్పుకోలేదు.ఎంతో దయామయంగా కనిపించిన ఈ చిన్నారి చేసిన పని ఇప్పుడు అందరి మనసుల్నీ మార్చివేస్తోంది.

Advertisement

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా ఈ రోజు ట్విట్టర్‌ లో షేర్ చేశారు.ఆయన ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే వందలాది మంది దీనిని రీట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చేస్తూ సుశాంత నందా “దయ మరొకరి కోసం చిన్నచిన్న పనులు చేయిస్తుంది.ఇదే పనీ దయతో మీరు చేయగలరు” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

చిన్నారుల నడవడికలు పెద్దల మనసులను మార్పు చేస్తాయనేది దాని సారాంశం.

తాజా వార్తలు