వైరల్... షార్క్ ని మింగేసిన మొసలి... అసలు ట్విస్ట్ ఏంటంటే?

మొసలి నీటిలో ఉంటే దాని బలం అంతా ఇంతా కాదు.ఒక్కసారి దాని కన్ను పడిందంటే ఇక ఆ జంతువు పని ఖతం అని చెప్పవచ్చు.

ఎందుకంటే అది దాడి చేసేది ఏ మాత్రం చడీచప్పుడు లేకుండా వచ్చి అకస్మాత్తుగా దాడి చేస్తుంది.ఇక దాని వలలో చిక్కిన జంతువు ఇక బతికి బయట పడటమంటే అదృష్టమనే చెప్పవచ్చు.

అలా ఎంత పెద్ద జంతువునైనా తన బలంతో దాడి చేసి చంపేస్తుంది.తాజాగా మొసలి షార్క్ పిల్లలను అమాంతం మింగేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

ఓ మహిళ తాను చేపల పట్టడానికి వేసిన వలలో రెండు షార్క్ పిల్లలు చిక్కాయి.ఇక ఆ షార్క్ పిల్లలను వదిలి పెడదామని భావించి ఒడ్డు మీద ఉంచడంతో అకస్మాత్తుగా వచ్చిన మొసలి ఆ షార్క్ పిల్లలను అమాంతం మింగేసింది.

Advertisement

ఈ వ్యవహారాన్ని మొత్తం ఆ సదరు మహిళ వీడియో తీసి నెట్టింట్లో వదిలింది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మొసలి చేసిన పనిని చూసి ఒక్కసారిగా ఖంగు తిన్నారు.

ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది.ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు