వైరల్: కుక్క మీద ప్రేమతో ఏకంగా కాంస్య విగ్రహం.. ఎక్కడంటే.?

మన ఇంట్లో వాళ్ళు గాని, బంధువులు గాని ఎవరైనా చనిపోతే నాలుగు రోజుల పాటు ఏడిచి మర్చిపోతాం.

లేదంటే కొన్ని రోజుల పాటు గుర్తోచినపుడల్లా బాధ పడుతూ ఉంటాము.

తరువాత మెల్లగా వాళ్ళని మర్చిపోతాము.మనుషులు చనిపోతేనే నాలుగు రోజుల పాటు ఏడిచి మర్చిపోయే ఈ కాలంలో తాను ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోయిందని ఐదు సంవత్సరాల నుంచి దానికి ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు ఏకంగా ఆ కుక్కకు కాంస్య విగ్రహం కూడా చేయించారు ఆ కుక్క యజమాని.

ఏంటి కుక్కకు విగ్రహం పెట్టడమే కాకుండా ప్రతి సంవత్సరం అంత్యక్రియలు కూడా చేయడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా.కానీ ఇది నిజం.

ఈ ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో చోటు చేసుకుంది.అంపాపురం గ్రామానికి చెందిన

సుంకర జ్ఞానప్రకాశరావు

అనే వ్యక్తి గతంలో ఓ కుక్కను పెంచుకున్నారు.

Advertisement

ఆ కుక్క అంటే అతనికి చాలా ఇష్టం.దానికి ముద్దుగా శునకరాజు అని పేరు.

కూడా పెట్టుకున్నాడు.కుక్కను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించి ఒక మనిషిలా దాని మీద అభిమానం పెంచుకున్నాడు.

శునకరాజు కూడా తన యజమాని అయిన జ్ఞానప్రకాశరావుతో ఎంతో ఆప్యాయంగా ఉంటూ ఆయన చెప్పినదల్లా అర్ధం చేసుకుంటూ వారి కుటుంబం పట్ల ఎంతో విశ్వాసంగా ఉండేది.కానీ ఐదేళ్ల క్రితం ఒక రోజు అనుకోకుండా పెంపుడు కుక్క అయిన శునకరాజు మరణించింది.

కుక్క మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంభ సభ్యులు కన్నీటి పర్యంతరం అయ్యారు.అలాగే అప్పట్లో దానికి అంత్యక్రియలు కూడా ఘనంగా నిర్వహించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..

అప్పటి నుంచి ప్రతి ఏడాది శునకరాజు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.కుక్క జ్ఞాపకాలను మరవలేని జ్ఞానప్రకాశరావు కుటుంబం దానికి ఏకంగా వాళ్ళ ఇంటి దగ్గరే ఒక కాంస్య విగ్రహం చేయించింది.అంతేకాకుండా ప్రతి ఏడాది కుక్క ఆత్మహకు శాంతి కలగాలంటూ పండితులను పిలిచి పూజలు చేయించారు.

Advertisement

కుక్క విగ్రహాన్ని పూలతో అలంకరించి దీపారాధనతో పాటు పిండప్రదానం కూడా చేశారు.అనంతరం బంధువులు, స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

ఎడతెరపి లేని వానలో కూడా కుక్క వర్ధంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఇది చూసిన ఊళ్లోవాళ్లు, చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్య పోయిన పెంపుడు కుక్కపై జ్ఞానప్రకాశరావుకు ఉన్న ప్రేమను చూసి నివ్వెరపోయారు.మనుషులు చనిపోతేనే నాలుగు రోజులు ఏడిచి మరిచిపోయే ఈ కాలంలో తాను పెంచుకున్న కుక్క మీద యజమాని పెంచుకున్న ప్రేమను చూసి అందరు ఆశ్చర్య పోయారు.

అలాగే తమ ప్రియమైన శునకరాజుకు నివాళులర్పిస్తూ ఆ కుటుంబం ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించింది.

తాజా వార్తలు