వైరల్: ఆ దేశంలో ఇంత నిరుద్యోగమా? కిక్కిరిసిన క్రికెట్‌ స్టేడియం, రోడ్లపైకి క్యూ?

ఇక్కడ ఫోటోలు చూస్తేనే మీకు దిమ్మతిరుగుతుంది కదూ.అవును మరి, నిరుద్యోగం మనదేశంలోనే కాదు.

మన పొరుగు దేశమైన పాకిస్థాన్ పరిస్థితి ఇది.ఫోటోలు చూసి అదేదో క్రికెట్ మ్యాచ్ అనుకుంటే పొరపాటే.వారు క్రికెట్ అభిమానులు కాదు, నిరుద్యోగులు.

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష కోసం వారు వచ్చారు.దీంతో అందరికీ ఇలా క్రికెట్‌ స్టేడియంలో రాత పరీక్ష ఒకేసారి నిర్వహిస్తున్నారు.

అయితే ఇంతమంది వచ్చారంటే ఖచ్చితంగా పోస్టులు వేల సంఖ్యలో వున్నాయి అనుకోకండి! ఎందుకంటే ఉన్నది 11 వందల ఉద్యోగాలు మాత్రమే.కానీ పోటీపడుతోంది మాత్రం 30 వేల మంది.

Advertisement

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో 1,167 పోలీసు ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించారు.దాని కోసం ఏకంగా 32,000 మంది నిరుద్యోగులు హాజరయ్యారని స్థానిక మీడియా పేర్కొంది.

తాజాగా పాక్‌లో నెలకొన్న తీవ్ర ఆర్ధిక సంక్షోభం రిత్యా అక్కడ నిరుద్యోగం తారా స్థాయికి చేరుకుంది అనడానికి ఇదే ఉదాహరణ.పాక్‌ మొత్తం జనాభాలో 31% మంది నిరుద్యోగులు ఉద్యోగాలులేక ఇబ్బందులు పడుతున్నారని విశ్వనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుత లెక్కల ప్రకారం ఆ దేశ నిరుద్యోగుల్లో 51 శాతం మహిళలు, 60 శాతం పురుషులు ఉన్నారు.

ఇక పాకిస్తాన్ జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు వారే కావడం కొసమెరుపు.ఉద్యోగాలు లేక అక్కడ యువతకి పిల్లలు దొరికే పరిస్థితి కూడా లేదని వినికిడి.కాగా తాజాగా చేపట్టిన పోలీస్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పరీక్షలు కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్న ఆ దేశ ప్రభుత్వం ఇలా అందరినీ ఒకే స్టేడియంకు పిలిచి చాలా వివాదాస్పద రీతిలో రాత పరీక్ష నిర్వహించింది.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

దీంతో దరఖాస్తు చేసుకున్నవారంతా పెన్నులు, ప్యాడ్‌లు పట్టుకుని వచ్చి స్టేడియంలో నేలపైనే కూర్చుని పరీక్ష రాశారు.కాగా దీనిపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.పరీక్ష జరిపే విధానం ఇది కాదని, అలా పరీక్ష పెడితే అందరూ సెలెక్ట్ అవుతారని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు