వైరల్: టామ్ అండ్ జెర్రీ అంటే ఇలాగే వుంటారా? ఎలుకను చూసి తుర్రుమన్న పిల్లి?

టామ్ అండ్ జెర్రీ.వెరీ ఫేమస్ కార్టూన్ కధలు.

వీటి గురించి మనకంటే చిన్నపిల్లలకే బాగా తెలుసు.ఈ కధలలో ఎక్కువగా ఓ ఎలుక పిల్లిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తూ ఉంటుంది.

అవి వాటి ఇష్టమొచ్చినట్టు కొట్టుకుంటాయి, తిట్టుకుంటాయి, తరువాత ఆ కొద్ది సేపటికే స్నేహం నటిస్తాయి.మరలా తరువాత ఒకదానిపై ఒకటి కోపాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటాయి.

మనలో చాలామంది తన చిన్నప్పుడు వీటికి సంబంధించినటువంటి వీడియోలు చూసే వుంటారు.అయితే అలాంటి ఓ జంటని రియల్ లైఫ్ లో చూసారా?.దాదాపు చూసుండరు కదూ.ఎందుకంటే నిజ జీవితంలో సాధారణంగా పిల్లిని చూసి ఎలుక చాలా భయపడుతూ పరుగెత్తి పారిపోతుంది.దానిని దయలేని పిల్లులు వేటాడి వాటి పొట్ట నింపుకుంటాయి.

Advertisement

అయితే ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది.అవును, వీడియోలో ఇక్కడ గమనించినట్టైతే ఓ ఎలుక పిల్లిని బెదిరించడాన్ని చూడవచ్చు.

సడెన్ గా ఆగిన ఎలుకను చూసి పిల్లి కంగారు పడిపోతుంది.అయితే ఎలుక అంతటితో ఆగకుండా పిల్లిని బెదిరించడాన్ని చూడవచ్చు.

కాగా ఈ ఫన్నీ వీడియో చూసిన నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.సదరు వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది.ఆ వీడియోకి ‘మీ ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు’ అనే క్యాప్షన్‌ని గమనించవచ్చు.

కేవలం 13 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియో ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టగా వేలకొలది లైక్స్ రావడం కొసమెరుపు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన

‘ఇవి రియల్ లైఫ్ టామ్ అండ్ జెర్రీ’ అని కొందరు కామెంట్స్ చేస్తే, పిల్లి శాకాహారి అయి ఉంటుందని, అందుకే అది నాన్ వెజ్ తీసుకోలేదని ఒక ఔత్సాహిక యూజర్ ఫన్నీగా కామెంట్ చేసాడు.

Advertisement

తాజా వార్తలు