Bangalore : వైరల్: బెంగళూరు వీధుల్లో యాపిల్ విజన్ ప్రో ధరించి యువకుడు చక్కర్లు..

బెంగళూరు( Bangalore ) నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్లకు కేరాఫ్ అడ్రస్.ఇక్కడి ప్రజలు ఎప్పుడూ కొత్త గ్యాడ్జెట్లు, ఆవిష్కరణలపై ఆసక్తి చూపుతారు.

మార్కెట్లోకి ఏ అద్భుతమైన పరికరం వచ్చినా వీళ్ళు వెంటనే కొనేస్తారు.ఇటీవల యాపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

ఇది ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు.అయినా బెంగళూరు వాసులు మాత్రం అప్పుడే కొనేసినట్లున్నారు.

ఇది వాస్తవ ప్రపంచంలో డిజిటల్ మీడియాను చూడటానికి, డిజిటల్ మీడియాతో ఇంట్రాక్ట్ కావడానికి యూజర్లను అనుమతిస్తుంది.హెడ్‌సెట్‌లో డయల్‌ను తిప్పడం ద్వారా వర్చువల్ వాతావరణానికి కూడా మారవచ్చు.

Advertisement

యాపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్( Apple Vision Pro Headset ) చాలా ఖరీదైనది, దీని ధర అమెరికాలో సుమారు మూడు లక్షలు.భారతదేశంలో ఇంకా అందుబాటులో లేదు.

కానీ కొంతమంది దీనిని యునైటెడ్ స్టేట్స్ నుంచి దిగుమతి చేసుకున్నారు, ఈ యాపిల్ విజన్ ప్రో 2024, ఫిబ్రవరి 2న లాంచ్ అయింది.వరుణ్ మయ్య అనే బెంగుళూరు వాసి దీనిని కొనుగోలు చేశాడు.

ఇటీవల రద్దీ ప్రాంతమైన ఇందిరానగర్ వీధుల్లో ఈ హెడ్‌సెట్ ధరించి కెమెరాలుకు చిక్కాడు.

వరుణ్ మయ్య హెడ్‌సెట్‌ను ఉపయోగిస్తున్న ఫోటోను ఆయుష్ ప్రణవ్( Ayush Pranav ) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు."ఇందిరానగర్ వీధుల్లో అతను తన విజన్ ప్రోతో ఆడుకుంటున్నాడు.ఇదొక పీక్‌బెంగళూరు మూమెంట్.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?

" అని ఈ ఫోటో పోస్ట్ కు క్యాప్షన్ జోడించారు.ఇది తక్కువ సమయంలోనే చాలా వ్యూస్ పొందింది.

Advertisement

పబ్లిక్‌గా హెడ్‌సెట్‌తో ఎంజాయ్ చేస్తున్న వరుణ్ మయ్యను చూసి కొందరు నవ్వుకున్నారు.ఇతరులు అలాంటి పరికరాన్ని బయట ఉపయోగించడం వల్ల తలెత్తే భద్రత, ఆరోగ్య ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.వర్చువల్ రియాలిటీ వరల్డ్‌లో మునిగిపోయే రియల్ వరల్డ్ పట్టించుకోకపోతే గుంతలలో పడిపోవచ్చు.

ఏవైనా వాహనాలు వచ్చే ఢీకొట్టవచ్చు.ఇంకా చాలానే ప్రమాదాలు అతడికి ఎదురయ్యే అవకాశం ఉంది.

దానికి తోడు హెడ్‌సెట్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు వస్తాయని మరికొందరు హెచ్చరించారు.

తాజా వార్తలు