వీడియో వైరల్: ఒక్కసారిగా కదులుతున్న బీఎండబ్ల్యూ కారులో చెలరేగిన మంటలు.. చివరకు..

ఇటీవల కాలంలో ఎండ తీవ్రతకు చాలా చోట్ల వాహనాలు మంటలు ఏర్పడి అక్కడికక్కడే కాలిపోయిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా కారులో మంటలు చెలరేగిన ఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది.

రోడ్డుపై కదులుతున్న బీఎండబ్ల్యూ కారు( BMW car )లో మంటలు చెలరేగాయి.ఈ ఘటన జూబ్లీహిల్స్‌( Jubilee Hills ) లోని రోడ్డు నంబర్‌ 45లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

రాత్రి 8:30 గంటల ప్రాంతంలో సంభవించిన బీఎండబ్ల్యూ కారు అగ్ని ప్రమాదం తరువాత, సదరు ప్రాంతంలో చాలా సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.ఆ ట్రాఫిక్ జామ్ కారణంగా ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి రావడం ఆలస్యమయ్యాయి.

చివరకు ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Advertisement

ఈ సంఘటనలో అదృష్టవశాత్తూ, కారులో ఉన్నవారు మంటలను గమనించి వాహనంలో నుండి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా తోపాటు ఎవరికీ గాయాలు కాలేదు.ఇక ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.గతంలో హైదరాబాద్‌ ( Hyderabad )లో కూడా ఇలాంటి కార్లకు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం ఎలాంటి వేడి పరిస్థితులు లేకపోయినా., ఇలా వాహనాల్లో మంటలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు.

అయితే ఏదో మాములు బ్రాండ్‌ వాహనం అయితే ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు.కాకపోతే అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బీఎమ్‌డబ్ల్యూ కారు కాలిపోవడం ఇప్పుడు అంత చర్చణీయాంశంగా మారింది.

కారు మంటల ఘటన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఫిల్మ్‌నగర్‌, ఒమేగా ఆసుపత్రి నుండి నందగిరి హిల్స్‌ వరకు కొన్ని గంటల పాటూ పూర్తిగా ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది.

మణిపూర్ లో భూకంపం..!!
Advertisement

తాజా వార్తలు