వీడియో: విమానంలో మొబైల్ ఫోన్ పట్టుకోకుండానే వీడియోలు చూసే హ్యాక్ వైరల్..

సాధారణంగా రోజువారీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి.వీటిని కొందరు తెలివిగా సాల్వ్ చేస్తుంటారు.

లైఫ్ హ్యాక్స్‌ అని పిలిచే ఈ సొల్యూషన్స్ సోషల్ మీడియాలో చాలామంది దృష్టిని ఆకట్టుకుంటుంటాయి. లైఫ్ హ్యాక్స్‌( Life hacks ) మాత్రమే కాదు కిచెన్ హ్యాక్స్‌, తదితరవి కూడా ఎంతగానో ప్రయోజనకరంగా నిలుస్తాయి.

అయితే తాజాగా మొబైల్ ఫోన్‌కి సంబంధించి ఒక హ్యాక్ వైరల్ గా మారింది.సాధారణంగా విమానంలో లేదా బస్సులో వెళ్లేటప్పుడు ఫోన్‌లో వీడియోలు చూడాలంటే చేత్తో పట్టుకోవాల్సి ఉంటుంది.

దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది.ముఖ్యంగా సుదీర్ఘమైన విమాన ప్రయాణాల్లో చేతులు ఉపయోగించకుండా ఫోన్‌లో వీడియోలు చూసే సదుపాయం ఉంటే బాగుంటుందనిపిస్తుంది.

Advertisement

కానీ ఆ ఫెసిలిటీ లేక చాలామంది ఫ్రస్ట్రేషన్‌కు లోనవుతారు.ఈ సమస్యకు ఓ మహిళ తెలివైన మార్గాన్ని కనుగొంది.

ఆమె తన ‘ఎయిర్‌ప్లేన్ హ్యాక్’( Airplane Hack ) వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.దాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు, ఆసక్తిగా ఉన్నారు.

మహిళ పేరు ఇడా అగస్టా( Ida Augusta ), ఆమె కంటెంట్ క్రియేటర్.ఇన్‌స్టాగ్రామ్‌లో ఎయిర్‌ప్లేన్ హ్యాక్ వీడియోను పోస్ట్ చేసింది.ఈ వీడియోలో అగస్టా తన ట్రిక్ చూపించడానికి సిద్ధం కావడం మనం చూడవచ్చు.

ఆమె తన ముందు సీట్ల కవర్లను ఉపయోగిస్తుంది.రెడ్‌ కలర్ కవర్లను కిందికి లాగి సీట్ల వెనుకకు వేలాడదీసింది.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
రన్నింగ్ ట్రైన్ లో ప్రత్యక్షమైన పాము.. దెబ్బకి ప్రయాణికులు?

ఆమె ఫేస్‌కి ఎదురుగా అవి వచ్చాయి.అప్పుడు, ఆమె, ఆమె ట్రావెల్ పార్ట్‌నర్ ఫోన్లను కవర్లలో ఉంచారు.

Advertisement

ఫోన్లను ఉంచడానికి రెడ్ కలర్ క్లాత్ ఉపయోగించారు.అంతే, వారు ఫోన్లను తాకకుండా వీడియోలను ఎలా చూడవచ్చో వీడియో చూపిస్తుంది.

అగస్టా, ఆమె భాగస్వామి తమ ఫోన్లలో వీడియోలను చూస్తూ ఎంజాయ్ చేశారు. వీడియోలో చివర్లో వారు చాలా రిలాక్స్‌గా, సంతోషంగా కనిపిస్తారు.ఈ హ్యాక్ చాలా సులభంగా ఉంటుంది.

ఆన్‌లైన్‌లో చాలా మంది దీని గురించి మాట్లాడుకునేలా చేసింది.కొంతమంది ఇది తెలివైనదని, దీనిని ప్రయత్నించాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇది ఫన్నీగా ఉందని కొందరు అన్నారు.కొంతమంది ఇది ఇతర ప్రయాణికుల పట్ల అసభ్య, అగౌరవ చర్య అని కామెంట్ చేశారు.వీడియో చూడడానికి ఈ లింక్‌ https://twitter.com/gupchup_news/status/1746702882953728081?t=vNReBu44r-I8HlCcSzGHow&s=19పై క్లిక్ చేయవచ్చు.

తాజా వార్తలు