వీడియో: 29 మంది ప్రయాణిస్తున్న హౌస్‌బోట్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. చివరికి...

సాధారణంగా మనుషులు ప్రయాణించే పడవల్లో మంటలు వ్యాపించి అవి దగ్ధం కావడం చాలా అరుదు.

అయితే తాజాగా లేక్ పావెల్‌పై రెండు నెలల పాపతో సహా 29 మందితో ప్రయాణిస్తున్న హౌస్‌బోట్‌లో అనూహ్యంగా మంటలు ఎగిసిపడ్డాయి.

ఒక్కసారిగా చెలరేగిన ఆ మంటలు క్షణాల్లోనే బోట్ చుట్టూ వ్యాపించాయి.అదృష్టం కొద్దీ అందులోని ప్రతి ఒక్కరూ త్వర త్వరగా సరస్సులోని నీళ్లలోకి దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

లేదంటే ఆ అగ్నిలో చాలామంది కాలి బూడిద అయ్యేవారు. అరిజోనా( Arizona )లోని గ్లెన్ కాన్యన్ నేషనల్ పార్క్ సమీపంలో ఉందీ సరస్సు.

ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరిగినా ప్రతి ఒక్కరూ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ బోట్‌ కాలిపోతున్నట్లు గ్లెన్ కాన్యన్ నేషనల్ పార్క్ సర్వీస్ (GCNPS) పెట్రోలింగ్ బోట్ సిబ్బంది గమనించింది.

Advertisement

మిగతా పడవల్లో వారు కూడా వారిని నీటి నుంచి బయటికి తీసి సురక్షితంగా కాపాడేందుకు కృషి చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ షాకింగ్ ఫుటేజీలో హౌస్‌బోట్ మంటల్లో కాలిపోతున్న భయానక దృశ్యాలు కనిపించాయి.దురదృష్టవశాత్తు, హౌస్‌బోట్ మొత్తం మంటల్లో దగ్ధమయింది.

దాని అవశేషాలు సరస్సు అడుగు భాగానికి చేరుకున్నాయి.

2023 సెప్టెంబర్ 13న అరిజోనాలోని గ్లెన్ కాన్యన్ నేషనల్ పార్క్( Glen Canyon National park ) సమీపంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.కాగా దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఈ హౌస్‌బోట్‌లో 29 మంది ఉంటే వారిలో రెండు నెలల పాప, ఇద్దరు పసిబిడ్డలు, ఎనిమిదేళ్ల మధుమేహం రోగి, మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

వారందరినీ ఆ ప్రాంతంలోని ఇతర బోటర్లు రక్షించారు, వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదు.

Advertisement

అగ్నిప్రమాదానికి దారి తీసిన కారణం ఏంటో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరైన మాడీ టోల్‌మాన్, వారు ఎక్కిన 45 నిమిషాల తర్వాత పడవ మోటారు పేలడంతో మంటలు చెలరేగాయని చెప్పారు.పావెల్ సరస్సులో హౌస్‌బోట్‌లో అగ్ని ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు.2023, జూన్‌లో, వాహ్వీప్ మెరీనాలో మరో అగ్నిప్రమాదంలో అనేక హౌస్‌బోట్‌లు దెబ్బతిన్నాయి.పరిశోధకులు అగ్ని ప్రమాదవశాత్తు జరిగినట్లు నిర్ధారించారు, కానీ ఖచ్చితమైన మూలాన్ని గుర్తించలేకపోయారు.

లేక్ పావెల్ ఉటా-అరిజోనా సరిహద్దులో బోటింగ్, ఫన్ యాక్టివిటీలకు ఒక పాపులర్ డెస్టినేషన్ గా మారింది.

తాజా వార్తలు