సాయి పల్లవి రౌడీ బేబీ పాటకు డ్యాన్స్ చేసిన విక్కీ కౌశల్.. నెట్టింట్లో వీడియో వైరల్!

తమిళ హీరో ధనుష్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం మారి 2.

ఇక ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.

టిక్ టాక్ లో సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా ఈ పాట కొద్దిరోజులపాటు మారుమోగిపోయింది.ఇక టిక్ టాక్ లో అయితే ఈ పాటను క్రియేట్ చేస్తూ కొన్ని వందల వీడియోలు చేశారు.

ఈ పాట సంగీత ప్రపంచంలో దుమ్ము లేపడమే కాకుండా యూట్యూబ్ లో నూరు కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకొని రికార్డులు తిరగరాసింది.యూట్యూబ్ లో అన్ని కోట్ల వ్యూస్ సాధించిన తొలి దక్షిణాది సినిమా ఇదే కావడం విశేషం.

మారి 2 సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ ఆ సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అయితే ఈ సినిమా విడుదల అయి ఇప్పటికి మూడు ఏళ్లు అవుతున్నా కూడా రౌడీ బేబీ పాట కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

Advertisement
Vicky Kaushal Shakes Leg To Sai Pallavi Dhanush Rowdy Baby Song Details, Vicky

అయితే ఈ రౌడీ బేబీ పాటకు సామాన్యుల తో పాటుగా, బుల్లితెర సీరియల్ సెలబ్రిటీలు, వెండితెర సెలబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులను ఇరగదీశారు.తాజాగా మరొక బాలీవుడ్ స్టార్ ఒకరు ఆ పాటకు స్టెప్పులేశారు.

సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోను షేర్ చేశారు.  మరి బాలీవుడ్ స్టార్ నటుడు ఎవరో కాదు విక్కీ కౌశల్.

Vicky Kaushal Shakes Leg To Sai Pallavi Dhanush Rowdy Baby Song Details, Vicky

తాజాగా విక్కీ కౌశల్ రౌడీ బేబీ సాంగ్ కు డాన్స్ వేసి అందుకు సంబంధించిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఆ వీడియో ని పోస్ట్ చేస్తూ వీడియో కింద క్యాప్షన్ ని కూడా రాసుకొచ్చారు.విక్కీ కౌశల్ షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విక్కీ కౌశల్ స్టెప్పులకు అభిమానులందరూ కూడా ఫిదా అయ్యారు.

Vicky Kaushal Shakes Leg To Sai Pallavi Dhanush Rowdy Baby Song Details, Vicky
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

అందుకు సంబంధించిన వీడియోని అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.ఈ వీడియోపై కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.ఆఫ్టర్ మ్యారేజ్ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా, కత్రినా ఒదిన ఎక్కడ అంటూ మరొక నెటిజెన్ కామెంట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు