ఛావా మూవీ క్రియేట్ చేసిన 8 క్రేజీ రికార్డులు ఇవే.. ఇప్పట్లో ఈ రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?

శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఛావా మూవీ( Chhaava Movie ) బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.

విక్కీ కౌశల్( Vicky Kaushal ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది.

భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.ఫిబ్రవరి నెల 14వ తేదీన థియేటర్లలో విడుదలైన ఛావా ఇప్పటివరకు 562 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

తెలుగులో ఈ సినిమా ఏకంగా 13 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.బుక్ మై షోలో 12 మిలియన్ టికెట్లు విక్రయమైన తొలి హిందీ మూవీగా ఛావా నిలిచింది.

ఈ సినిమా ఈ ఏడాది విడుదలై హిట్ గా నిలిచిన స్త్రీ2( Stree 2 ) రికార్డును సైతం బ్రేక్ చేయడం గమనార్హం.ఈ ఏడాది గ్రాస్ కలెక్షన్ల విషయంలో సైతం ఈ సినిమా హిట్ కావడం గమనార్హం.

Vicky Kaushal 8 Crazy Records Chhaava Details, Vicky Kaushal , Chhaava Movie Rec
Advertisement
Vicky Kaushal 8 Crazy Records Chhaava Details, Vicky Kaushal , Chhaava Movie Rec

విక్కీ కౌశల్ గత సినిమాల కలెక్షన్ల రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది.ఐదో వీకెండ్ లో సైతం 22 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి స్త్రీ2, పుష్ప2( Pushpa 2 ) రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది.22 రోజుల్లో 500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ఈ సినిమా నిలిచింది.హిందీ సినిమాల్లో సెకండ్ వీక్ లో 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచింది.

Vicky Kaushal 8 Crazy Records Chhaava Details, Vicky Kaushal , Chhaava Movie Rec

విక్కీ కౌశల్ కెరీర్ లో తొలిరోజు కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టించింది.విక్కీ కౌశల్ ఉరి సినిమా ఫస్ట్ డే కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేసింది.విక్కీ కౌశల్ వాలంటైన్స్ డే రోజున విడుదలై అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమాతో రికార్డ్ అందుకున్నారు.

విక్కీ కౌశల్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.

ఒకప్పుడు మహేష్ బాబు చేసిన తప్పు ఏంటో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు