యూత్ స్టార్ నితిన్( Nitin ) మరోసారి తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో చేయి కలిపాడు.
ఛలో, భీష్మ వంటి రెండు సూపర్ హిట్స్ ను అందుకుని ఫేమస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
అయితే ఈయన భీష్మ( Bheeshma ) తర్వాత మరో సినిమా చేయలేదు.ఈ సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత మొన్ననే మరో సినిమాను ప్రకటించాడు.
అది కూడా మళ్ళీ భీష్మ కాంబోలో.నితిన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా భీష్మ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.
డైరెక్టర్ వెంకీ కుడుముల( Venky Kudumula ) దర్శకత్వంలో ఈ కాంబో తెరకెక్కగా మళ్ళీ ఇదే కాంబోలో మరో సినిమా రాబోతుంది అని అనౌన్స్ మెంట్ వచ్చింది.VNRTrio అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.
వెంకీ కుడుముల లేటెస్ట్ గా ప్రకటించిన ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.ఇక అనౌన్స్ మెంట్ వీడియో తోనే రచ్చ రచ్చ చేసిన ఈ కాంబో అంచనాలు బాగా క్రియేట్ చేసుకుంది.ఇప్పటికే గ్రాండ్ లాంచ్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఈ సినిమా నుండి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఉందని ఆ పాత్రలో ఒక స్టార్ హీరోను నటింపజేయాలని వెంకీ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.అందుకోసం వెంకీ ఒక బాలీవుడ్ హీరోను ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారట.మరి బాలీవుడ్ స్టార్ కనుక ఇప్పుకుంటే ఈ సినిమాకు హిందీ మార్కెట్ లో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
చూడాలి వెంకీ ఏ స్టార్ ను ఒప్పిస్తాడో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy