ఆ రెండింటికి ఓకే చెప్పిన వెంకటేష్..!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం F3 అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కూడా నటించిన విషయం తెలిసిందే.

F2 తో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో F3 తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.మే 27న రిలీజ్ అవబోతున్న F3 సినిమా కోసం భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు.

Venkatesh Green Signal For Two Big Productions, Venkatesh, Salman Khan,Mythri Mo

ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఇప్పటికే ఓ బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిన విషయం తెలిసిందే.సల్మాన్ ఖాన్ చేస్తున్న కబి ఈద్ కబి దీవాళీ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటుగా టాలీవుడ్ లో రెండు బ్యానర్ లకు వెంకటేష్ ఓకే చెప్పారని టాక్.అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ కాగా.

Advertisement

మరొకటి సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ అని తెలుస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ వరుస స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.

ఆ లిస్ట్ లో ఇప్పుడు వెంకటేష్ కూడా చేరారు.వెంకటేష్ మైత్రి కాంబో మూవీ డైరక్టర్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు.

ఇక సితార బ్యానర్ లో వెంకటేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఈ రెండు సినిమాలతో వెంకటేష్ మరోసారి ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయ్యారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు