టాలీవుడ్ లో పండగలకు సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీ.అందులో మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటే మన హీరోలందరికీ ఇష్టం అప్పుడు సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్ల సునామీ రావడం ఖాయం కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన రికార్డ్ స్థాయి కలెక్షన్లు వస్తాయి.
అందుకే సంక్రాంతి పండుగకు ముందుగానే డేట్స్ బ్లాక్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు.
అయితే 2022 సంక్రాంతి బరిలోకి ఇప్పటి నుండే పోటీ మొదలయ్యింది.
ఈసారి సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉండేట్టు ఉంది.ఎందుకంటే కరోనా కారణంగా ఇప్పటి వరకు థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో సినిమాలు అన్ని విడుదల అవ్వకుండా అలాగే ఉన్నాయి.
ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఎలాగూ చిన్న సినిమాలు దైర్యం చేసి సంక్రాంతికి పోటీ పడవు.అందుకే పెద్ద సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలో ఉంటాయి.వాటిల్లో ఇప్పుడు F3 సినిమా చేరిపోయింది.
మొన్నటి వరకు ఈ సినిమా ఆగస్టులో విడుదల అవ్వబోతుందని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా వెంకటేష్ F3 సినిమా సంక్రాంతి బరిలోనే ఉండబోతుందని ఇంటర్వ్యూ లో తెలిపాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఎఫ్ 2 సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఈసారి ఎఫ్ 3 తో కడుపుబ్బా నవ్వించడానికి వెంకటేష్, వరుణ్ తేజ్ రెడీ అయ్యారు.ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.నారప్ప ప్రమోషన్స్ లో వెంకటేష్ ఈ సినిమా సంక్రాంతి బరిలోకి రాబోతుందని కన్ఫర్మ్ చేసాడు.