'మెగా 157'పై హైప్ పెంచేస్తున్న డైరెక్టర్.. చిరు రోల్ అలా ఉండబోతుందట!

మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు.

ఇటీవలే చిరంజీవి కొత్తగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.

గత నెలలో మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు.అందులో మెగా 157 ఒకటి.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా అదిరిపోయింది.

ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి( Mallidi Vasishta ) తెరకెక్కిస్తున్న విషయం విదితమే.బింబిసార వంటి హిట్ అందుకున్న వసిష్ఠ మెగాస్టార్ తో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీయబోతున్నట్టు తెలుస్తుంది.

Advertisement

పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు.అలాగే ఈసారి ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ కంపెనీ పని చేయనుందని సమాచారం.

మొత్తంగా చిరంజీవి భోళా శంకర్ వంటి ప్లాప్ ను మరోసారి రిపీట్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు.కాగా ఈ సినిమా గురించి తాజాగా డైరెక్టర్ వసిష్ఠ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ లో సాగుతూ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు.

అలాగే కొన్నాళ్ల క్రితం చిరంజీవి( Chiranjeevi ) గారి బ్లాక్ బస్టర్ జగదేకవీరుడు అతిలోక సుందరిలో ఆయన పాత్రను అందరు ఎలా ఇష్టపడ్డారో అలానే ఇప్పుడు ఈ సినిమాలో ఆయన రోల్ ను అందరు ఇష్టపడేలా డిజైన్ చేసినట్టు తెలిపారు.ఇలా ఒక్కో అప్డేట్ తో ఈ సినిమాపై మరింత హైప్ ఎక్కిస్తున్నాడు.అంతేకాదు ఈ సినిమా విఎఫ్ఎక్స్ కు ఈ సినిమాకు కీలక పాత్ర పోషిస్తుందని టాక్.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

కాగా ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా అనుష్క శెట్టి( Anushka Shetty )ని తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.మరి అనుష్క కూడా ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాలో రోల్ కు ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.

Advertisement

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

తాజా వార్తలు