నిశ్చితార్థం తర్వాత మొదటిసారి సెట్ లోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) ప్రస్తుతం రెండు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఈయన ఈ రెండు సినిమా షూటింగ్లను కూడా పెళ్లికి ముందే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో శర వేగంగా ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటున్నారు.

ఇకపోతే జూన్ 9వ తేదీ నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి వరుణ్ తేజ్ నిశ్చితార్థం తర్వాత మొదటిసారి షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెట్టారు.ఈయన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ( Praveen Satthar ) దర్శకత్వంలో గాండీవధారి అర్జున ( Gandeevadhari Arjuna ) అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ జేమ్స్ బాండ్ తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయిందని సమాచారం.ఈ సినిమాని ఆగస్టు 25వ తేదీ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం VT 13 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది.దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ( Sakthi Prathap Singh )దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని జెట్ ఫైటర్ గా కనిపించబోతున్నారు.

Advertisement

తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొన్నారు.ఇలా నిశ్చితార్థం తర్వాత ఈయన మొదటిసారి షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెట్టారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని యాక్షన్ సన్ని వేషాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని కూడా పెళ్లికిలోపే పూర్తి చేయాలన్న ఆలోచనలో వరుణ్ తేజ్ ఉన్నట్టు సమాచారం.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు