ఆయుష్ విభాగంలో ఉన్న ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలి నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ...

ఆయుష్ విభాగంలో ఉన్న ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలి నేషనల్‌ ఇంటి గ్రేటెడ్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌లో డిమాండ్‌ చేసింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఒక ఉద్యోగ నియమాకం చేపట్టాలేదని ఆ సంస్థ సలహాదారుల జ్యోత్స్న మండిపడ్డారు.

2011 నుంచి ఆయుష్‌ విభాగం పోస్టు గ్రాడ్యూయేట్‌ చేసిన విద్యార్థులు, వైద్యులు ఉద్యోగల నోటిఫికేషన్‌ ఎదరుచూస్తున్నారని పేర్కొన్నారు.ఈనెల 13 న కాంట్రాక్టు ప్రతి పాదికన నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.జీవో 66 స్పెషల్‌ సర్వీస్‌ రూల్‌ ఆఫ్‌ ఆయుర్వేద పాటించాలేదన్నారు.66వ జీవో అమలు చేయకపోవడం వల్ల అర్హులైన వైద్యులు అప్లై చేసుకునే అర్హత కోల్పోయారన్నారు.కాంట్రాక్టు నోటిఫికేషన్ తాత్కాలికం.

కాబట్టి రెగ్యులర్ నోటిఫికేషన్ వేయాలన్నారు.ఆయుర్వేద వైద్య విద్యార్థులకు, వైద్యులకు జరుగుతున్న అన్యాయంపై నిమా పోరాటం చేస్తుందన్నారు.

వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.గత 10 ఏళ్ల నుంచి ఆయుష్‌ విభాగంలో ఉద్యోగ నోఫికేషన్‌ వేయకపోవడం వల విద్యార్థులు, వైద్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వైద్య విద్యార్థులు వాపోతున్నారు.

Advertisement
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు