భారతీయులకు గుడ్ న్యూస్... హెచ్ -1బీ వీసాపై అమెరికా కీలక నిర్ణయం..!!

అమెరికాలో ఉన్న పలు ఐటీ కంపెనీలు వివిధ రంగాలలో లో నిపుణులైన విదేశీయులను ఉద్యోగాలలో నియమించు కొనేందుకు వీలుగా అమెరికా మూల వాసుల కోసం ప్రత్యేకంగా.

హెచ్ -1బి వీసా ను ఏర్పాటు చేసింది.

ఈ వీసా కేవలం విదేశాల నుంచి అమెరికాకు వచ్చే నిపుణులైన విదేశీయులకు మాత్రమే జారీ చేస్తారు.ఎన్నో ఏళ్ల నుంచి చి ఈ వీసా ఆధారంగానే ఎంతో మంది భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించి చి ఉన్నత స్థానాలను అధిరోహించారు.

US Govt Agreed To Start Issuing H1b Visa From September, US Govt, H1b Visa, Sept

అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ -1బి వీసా పై పలు రకాల ఆంక్షలు విధించారు.అయితే బిడెన్ అధికారంలోకి వచ్చినతరువాత హెచ్ -1బి నిబంధనల్లో మార్పు చేస్తానని , ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న వీసాలపై చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో హెచ్ -1బి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న భారతీయ నిపుణులకు అమెరికా గుడ్ న్యూస్ తెలిపింది ఈ మేరకు.భారత విదేశాంగ కార్యర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ఓ ప్రకటన చేశారు.

Advertisement

అమెరికా భారతీయ నిపుణులకు హెచ్ -1బి వీసాలను సెప్టెంబర్ నుంచీ జారీ చేయనుందని, అందుకు అంగీకారం తెలిపిందని ఆయన ప్రకటించారు.అలాగే అమెరికాలో ఉండే ఇతరత్రా వీసాల జారీ ప్రక్రియ ఈ ఏడాది చివరిలో మొదలవుతుందని ఆయన ప్రకటించారు.

ఇదిలాఉంటే అమెరికా తాజా నిర్ణయంతో భారతీయులకు భారీ లబ్ది చేకూరనుందని అంటున్నారు నిపుణులు.

Advertisement

తాజా వార్తలు