జిల్లాలో విస్తృతంగా గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు.

జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో రెండు రోజులలో ఆరుగురు నిందుతుల అరెస్ట్.వీరి వద్ద నుండి 600 గ్రాముల గంజాయి స్వాధీనం.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు విస్తృతంగా గంజాయి కిట్ల సహాయంతో తనిఖీలు చేపట్టడం జరుగుతుందని,రెండు రోజుల వ్యవధిలో అరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేయడం జరిగిందని, గంజాయికి అలవాటు పడి తాగేవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా మార్చడాని జిల్లా పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పింస్తుదని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు.జిల్లాలో విస్తృతంగా గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు చేస్తూ గంజాయి సేవించే వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని గడించిన రెండు రోజుల వ్యవధిలో సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇద్దరూ నిందుతులు ఒల్లెపు వంశీ,ఒల్లెపు బీమ్రాజ్ అదుపులోకి తీసుకొని వారి వద్ద 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు నిందుతులు గాజులవేణి అరుణ్,అజ్మీర వికాస్ లను అదుపులోకి తీసుకొని వారి వద్ద 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.తంగాళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఇద్దరు నిందుతులు లింగం సాయి, గంగాధర సాగర్ లను అదుపులోకి తీసుకొని వారి వద్ద 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

గంజాయికి సంబంధించిన సమాచారం డయల్ 100 లేదా టాస్క్ఫోర్స్ సి.ఐ ఫోన్ నెంబర్ 87126 56392 కి సమాచారం అందించగలరని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

Advertisement
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం : కమాండెంట్ యస్.శ్రీనివాస రావు

Latest Rajanna Sircilla News