యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్.. ఫస్ట్ ర్యాంక్ సాధించిన భావన సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

యూపీఎస్సీ( upsc ) పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.

తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాలంటే ఏ స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కొంతమంది సులువుగానే యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధిస్తే మరి కొందరు ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు రావు.మరి కొందరు ప్రయత్నాలు చేసి విసుగు చెంది మరో రంగాన్ని ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయి.

అయితే ఐఏఎస్ భావన గార్గ్( Bhawna garg ) మాత్రం తొలి ప్రయత్నంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించింది.పంజాబ్ కు చెందిన భావన సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.భావన తండ్రి జూనియర్ ఇంజనీర్ కాగా ఈమె భర్త ఐఏఎస్ ఆఫీసర్ కావడం గమనార్హం.1998 సంవత్సరంలో ఐఐటీ కాన్పూర్ నుంచి భావన కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు.

ఐఐటీ కాన్పూర్( IIT Kanpur ) లో బీటెక్ పూర్తైన ఏడాది తర్వాత భావన యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యారు.తన టాలెంట్ తో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించి భావన ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.సరైన ప్రణాళికతో ముందడుగులు వేస్తే తొలి ప్రయత్నంలోనే సక్సెస్ కావచ్చని చెప్పడానికి భావన ఉదాహరణ అని చెప్పవచ్చు.

Advertisement

ఐఏఎస్ శిక్షణ సమయంలో సైతం భావన ఉత్తమ ప్రతిభను కనబరిచారు.

ఆ సమయంలో భావన టాలెంట్ కు బంగారు పతకం లభించింది.భావన ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు.ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలనే ప్రణాళికతో చదవడం వల్ల ఆమె తన లక్ష్యాలను సులువుగా సాధించారు.

ఎంతోమంది అభ్యర్థులకు స్పూర్తిదాయకంగా నిలిచిన భావన గార్గ్ తన సక్సెస్ తో ప్రశంసలు అందుకున్నారు.ఆమె ప్రతిభను చూసి మేధావులు సైతం ఫిదా అవుతున్నారు.

చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు