Daggubati Purandeswari: దగ్గుబాటి పురంధేశ్వరి కి ఉన్న ఈ ట్యాలెంట్స్ గురించి మీకు తెలుసా ?

దగ్గుబాటి పురంధేశ్వరి( Daggubati Purandeswari ) గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు.పురంధేశ్వరి ఎన్టిఆర్, బసవతారకం కుమార్తె అని అందరికి తెలిసిందే.

ఎన్టిఆర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో అద్భుతమైన విజయాల్ని సాధించారు.

సినిమాల్లో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకొని, ప్రజలకోసం ఏదైనా చేయాలని తెలుగుదేశం పార్టీని స్థాపించారు.స్థాపించిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు.

ఆ తరువాత వారి కుటుంబంలో ఎంతో మంది సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు.ఇక ఎన్టిఆర్ కూతురు పురంధేశ్వరి ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు.

Advertisement

పురంధేశ్వరికి దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో వివాహం జరిగింది.పురంధేశ్వరి గురించి మరి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఎన్టిఆర్( N .T.Rama Rao ) కుమార్తెలలో పురంధేశ్వరికి సంగీతం, సాహిత్యంపై మంచి పట్టు ఉంది.అంతేకాదు 1996లో జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో రత్నాల శాస్త్రంలో డిప్లొమా చేసి పట్టాను అందుకున్నారు.

ఆమె శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించారు.సితార వాయించడంలో కూడా పురంధేశ్వరి నేర్పరి అనే చెప్పాలి.

ఆమె ప్రతిభ, సంస్కారం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి.పురంధేశ్వరి ఒక సమర్థవంతమైన మహిళ కూడా.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

ఆమె ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.నేనే పెద్ద, అహం ఇటువంటివి ఏమి పురంధేశ్వరిలో కనిపించవు.1997లో హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెమ్ అండ్ జ్యువెలరీని పురంధేశ్వరి స్థాపించింది.పురంధేశ్వరికి తెలుగులోనే కాదు ఇంగ్లీష్ రాయడం, మాట్లాడడం కూడా బాగా వచ్చు.

Advertisement

భారతీయ నృత్య రూపకం కూచిపూడిలో ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి.పురంధేశ్వరి 1979న దగ్గుబాటి వెంకటేశ్వరరావును వివాహం చేసుకుంది.

వీరికి ఒక కుమార్తె నివేదిత మరియు కుమారుడు, హితేష్ చెంచురామ్ ఉన్నారు.

ఇక నందనూరి కుటుంబంలో ఎవరు ఏం అవుతారో అందరికి తెలిసిందే.పురంధేశ్వరి నందమూరి బాలకృష్ణ, హరికృష్ణలకి సోదరి అవుతుంది.చంద్రబాబు నాయుడుకు కోడలు, నారా లోకేష్, కళ్యాణ్ రామ్ కి అత్త అవుతుంది.

అయితే ఇప్పటివరకు చాలా మందికి ఇంతే విషయాలు తెలియగా పురంధేశ్వరి మాత్రం ఎన్టిఆర్ కుమార్తెలలో అన్నిటిలో అద్భుతంగా రాణిస్తుంది.ఆమె ఒక మంచి కూతురుగా, భార్యగా, తల్లిగా ఆమె అందరికీ ఆదర్శం నిలుస్తుంది.

తాజా వార్తలు