UK MP Bob Blackman : అయోధ్య రామమందిరంపై పక్షపాత వైఖరితో కవరేజ్.. బ్రిటీష్ మీడియాపై యూకే ఎంపీ ఆగ్రహం

కోట్లాది మంది భారతీయులు ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరదించుతూ శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో రామ్ లల్లా( Ayodhya Ramlalla ) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.

జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) చేతుల మీదుగా ఈ క్రతువు ముగిసింది.

ఆ మరుసటి రోజు నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.దేశ విదేశాల్లోని హిందువులు రాములోరిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగింది.రాముడి జన్మభూమిగా భావించే చోట, రామ మందిరాన్ని నిర్మించడం కోసం వందల ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి.

మరెన్నో వివాదాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.అద్వానీ రథయాత్ర సమయంలో , ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

అన్ని రకాల అవాంతరాలను అధిగమించి టెంట్‌లో వున్న రామ్ లల్లా.భవ్యమందిరంలోకి చేరాడు.

ఇంతటి చారిత్రాత్మక కార్యక్రమంపై కొన్ని దేశాలు, సంస్థలు, వ్యక్తులు విద్వేషం వెళ్లగక్కారు.ఇదే సమయంలో రామాలయంపై బ్రిటీష్ మీడియా( British Media ) పక్షపాతంగా రిపోర్టింగ్ చేయడంపై యూకే పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్‌మన్( UK MP Bob Blackman ) ఆందోళన వ్యక్తం చేశారు.

శుక్రవారం యూకే పార్లమెంట్‌లో బ్లాక్ మన్ మాట్లాడుతూ.‘‘ గత వారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని( Ayodhya Ram Mandir ) ప్రతిష్టించారు.ఇది శ్రీరాముడి జన్మస్థలం కావడంతో ప్రపంచవ్యాప్తంగా వున్న హిందువులకు చాలా సంతోషాన్ని కలిగించింది.

కానీ విచారకరంగా బీబీసీ( BBC ) వారి కవరేజీలో ఇది ఒక మసీదు విధ్వంసం జరిగిన ప్రదేశమని నివేదించింది.ఇది జరగడానికి 2 వేల ఏళ్ల క్రితమే ఇది ఒక దేవాలయమనే విషయాన్ని మరిచిపోయింది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

పట్టణానికి ఆనుకుని మసీదు నిర్మించేందుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించారు ’’.

Advertisement

బీబీసీ నిష్పాక్షికత , ప్రపంచవ్యాప్తంగా వాస్తవంగా ఏం జరుగుతోందనే దాని గురించి సరైన రికార్డును అందించడంలో దాని వైఫల్యంపై చర్చకు సమయం ఇవ్వండి ’’ అని బ్లాక్‌మన్ సహచర ఎంపీలను కోరారు.బీబీసీ పక్షపాతంతో రామమందిరంపై కవరేజీ చేయడంపై సభ్యులు లేవనెత్తారని ఎక్స్‌‌లో బ్లాక్‌మన్ పోస్ట్ చేశారు.హిందువుల హక్కుల పట్ల ఆసక్తిగల మద్ధతుదారుగా ఈ కథనం అసమానతను కలిగించిందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో బీబీసీ తప్పనిసరిగా సరైన రికార్డును అందించగలగాలని బ్లాక్‌మన్ హితవు పలికారు.

తాజా వార్తలు