వామ్మో ప్రభాస్ కోసం షూటింగ్ కి డుమ్మా కొట్టిన హీరో... ఎవరంటే?

నేషనల్ స్టార్ ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే బాహుబలి సాహో సినిమాల తర్వాత ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీ విడుదల కానుంది.

ఐదు భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా విడుదల కానుంది.ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇప్పటికే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించిన చిత్ర బృందం చెన్నైలో కూడా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు రాధేశ్యామ్ చిత్రబృందం మొత్తం హాజరుకాగా తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, హీరో, ఎమ్మెల్యే ఉదయనిది స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకల్లో భాగంగా ఉదయనిది స్టాలిన్ మాట్లాడుతూ.నాకు ఈ రోజు షూటింగ్ ఉన్నా కూడా ప్రభాస్ సినిమా కోసం షూటింగుకు లీవ్ పెట్టి వచ్చానని చెప్పడం ఎంతో ఆసక్తికరంగా మారింది.

Advertisement

అయితే ఉదయనిధి స్టాలిన్ ప్రభాస్ పై ఉన్న అభిమానంతో ఇలా తన షూటింగ్ కి డుమ్మా కొట్టారా అనుకుంటే పొరపాటే.తమిళనాడులో పాటు మలేషియా వంటి దేశాలలో కూడా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాని ఉదయనిధి స్టాలిన్ విడుదల చేయడంతో ఈయన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ విధంగా తమిళనాడులో ప్రభాస్ సినిమాకి ఏకంగా ఉదయనిధి స్టాలిన్ సపోర్ట్ ఉండడంతో తమిళనాడులో ఈ సినిమాకి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావనే విషయం తెలుస్తుంది.

ఎన్టీఆర్ యాక్షన్ షురూ చేసేది అప్పుడేనట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement
" autoplay>

తాజా వార్తలు