Natural Amla Serum : జుట్టును ఒత్తుగా నల్లగా పెంచే ఆమ్లా సీరం.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!

అధిక హెయిర్ ఫాల్ సమస్య( Hair fall problem )తో బాధపడుతున్న వారు మనలో చాలా మంది ఉన్నారు.

జుట్టు అధికంగా రాలిపోవడం వల్ల కురులు పల్చగా మారిపోతాయి.

అలాగే ఇటీవల కాలంలో ఎంతో మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

కారణం ఏదైనప్పటికీ ఈ సమస్యలకు ఓ అద్భుతమైన సొల్యూషన్ ఉంది.అదే ఆమ్లా సీరం.

ఈ సీరం ను వారానికి రెండు సార్లు కనుక వాడారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.అదే సమయంలో తెల్ల జుట్టు సమస్య( White hair problem )కు సైతం దూరంగా ఉండవచ్చు.

Advertisement
Try This Natural Amla Serum For Thick And Black Hair-Natural Amla Serum : జ�

మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే సులభంగా ఆమ్లా సీరం ను ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

Try This Natural Amla Serum For Thick And Black Hair

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.ఆపై మూత వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు మరియు మిరియాలను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే మరో కప్పు వాటర్ వేసుకుని పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన పదార్థాలను మెత్తగా స్మాష్ చేసుకోవాలి.ఇలా స్మాష్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన ఆమ్లా సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

Advertisement

గంటపాటు షవర్ క్యాప్ ధరించి అనంతరం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ ఆమ్లా సీరం ను కనుక వాడారంటే అద్భుత ఫలితాలను మీరు పొందుతారు.

ఈ సీరం జుట్టు రాలడాన్ని చాలా వేగంగా తగ్గిస్తుంది.అలాగే జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.కురులు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా హెల్ప్ చేస్తుంది.

అలాగే ఈ సీరం జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు తెల్ల బ‌డకుండా అడ్డుకట్ట వేస్తుంది.ఒకవేళ తెల్ల జుట్టు ( white hair )ఉన్నా కూడా నల్లగా మార్చడానికి ఈ సీరం చాలా బాగా సహాయపడుతుంది.

కాబట్టి ఒత్తైన పొడవాటి జుట్టును కోరుకునేవారు, తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలి అని భావించేవారు తప్పకుండా ఈ ఆమ్లా సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు