Trivikram : ఇన్నాళ్లు ఆ లేడీ రైటర్‌పైనే ఆధారపడ్డ త్రివిక్రమ్.. కానీ ఆమె లేకపోవడంతో పరేషాన్‌..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) "నువ్వు నాకు నచ్చావ్", "చిరునవ్వుతో", "మన్మథుడు", "మల్లీశ్వరి" వంటి హిట్ సినిమాలకు కథలు అందించి గొప్ప రైటర్ గా పేరు తెచ్చుకున్నాడు.

తర్వాత డైరెక్టర్ గా మారి నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా వంటి సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు.

ఈ మూవీలకు కూడా తానే కథలు రాసుకున్నాడు.ఈ డైరెక్టర్ రాసే కథలు, డైలాగులు అద్భుతంగా ఉంటాయి.

ఆ డైలాగులను గుర్తుపెట్టుకుని నిజ జీవితంలో వాటిని చెప్పే ఫ్యాన్స్ కూడా ఉన్నారు.త్రివిక్రమ్ కి హీరో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా అతడికి ఉన్న మంచి పేరు మాయమై పోతుంది."గుంటూరు కారం"( Guntur Kaaram ) సినిమాతో ఈ దర్శకుడి గ్రాఫ్ మరింత పడిపోయింది.అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ సినిమాలతో నిరాశపరిచిన త్రివిక్రమ్ మళ్ళీ "గుంటూరు కారం"తో డిసప్పాయింట్ చేశాడు.

Advertisement

మహేష్ బాబు నటించిన ఈ మూవీ ఫ్లాప్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ని తిట్టిపోస్తున్నారు.త్రివిక్రమ్ పని అయిపోయిందని, అతడు మంచి కథలు రాయలేడని కొందరు దారుణంగా విమర్శిస్తున్నారు.

త్రివిక్రమ్ ప్రముఖ తెలుగు రచయిత యద్దనపూడి సులోచన రాణి( Yaddanapudi Sulochana Rani ) రాసిన నవలల నుంచి కాపీ కొడుతుంటాడని ఇంకొందరు తీవ్ర ఆరోపణలు చేశారు.ఆమె రాసిన నవలలోని కథలను కాస్త మార్చేసి వాటినే సినిమాలుగా తీసి త్రివిక్రమ్ గతంలో హిట్స్ కొట్టాడని, కానీ ఇప్పుడు ఆమె చనిపోవడం, ఆమె నుంచి ఎలాంటి నవలలు రాకపోవడం వల్ల అతడు స్టోరీ డెవలప్ చేసుకోలేకపోతున్నాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

యద్దనపూడి సులోచన రాణి బతికి ఉంటే ఆమె కనీసం గత ఐదేళ్లలో నాలుగైదు నవలలు అయినా రాసేవారు.వాటిలోని స్టోరీలను, క్యారెక్టర్లను త్రివిక్రమ్ కాపీ కొట్టి ఏదో ఒక మంచి సినిమా తెరకెక్కించేవాడు, ఆమె లేకపోవడం వల్లే సరైన కథలను క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు అని మరి కొందరు అంటున్నారు.మరి ఇందులో ఎంత నిజం ఉందో నవలలు చదివిన వారు, ఆయన సినిమాలు చూసిన వారికే తెలియాలి.

ఇక త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్( Allu Arjun ) కథానాయకుడిగా రూపొందిస్తున్న సినిమాతో హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.లేదంటే అతడిని ఇండస్ట్రీ పూర్తిగా పక్కన పెట్టేసే ప్రమాదం ఉంది.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు