సీబీఐ జాబ్ కు రాజీనామా.. విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన శివ.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) సాధించడం అంటే ఎంతోమంది కల అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా జీవనం సాగించవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మారుమూల పల్లెలో పుట్టి ఎన్నో కష్టాలను అనుభవించి కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన వాళ్లలో నాగవల్లి శివ( Nagavalli Shiva ) ఒకరు.సీబీఐ ఉద్యోగాన్ని ఎంతో కష్టపడి సాధించిన శివ పశ్చిమ గోదావరి జిల్లాలోని( West Godavari District ) గుడ్డి గూడెం గ్రామంలో జన్మించారు.పేద కుటుంబంలో జన్మించిన శివ బాల్యంలో ట్యూషన్లు చెప్పుకుంటూ చదువుకున్నారు.2012 సంవత్సరంలో శివ డీఎస్సీ( DSC ) రాసి ఇంగ్లీష్ టీచర్ గా ఎంపిక కావడం జరిగింది.ఆ తర్వాత 2014 సంవత్సరంలో శివ ఒకేసారి రెండు గవర్నమెంట్ జాబ్స్ కు ఎంపికయ్యారు.

శివ గ్రూప్ 4లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్ లో జాబ్ సాధించడంతో పాటు గ్రూప్3 లో ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంట్ లో ఉద్యోగం సాధించడం గమనార్హం.

ఢిల్లీలో శివ జాబ్ లో జాయిన్ అయిన కొత్తలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేస్తున్న తెలుగు వాళ్లు చాలా తక్కువగా ఉన్నారని తెలిసింది.ఇంగ్లీష్ భాష ఇందుకు కారణమని తెలిసి సీబీఐ జాబ్ కు( CBI Job ) రాజీనామా చేసిన శివ విశాఖలో త్రినేత్ర ( Trinetra Academy ) పేరుతో అకాడమీని మొదలుపెట్టారు.ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో శివ వెలుగులు నింపారని సమాచారం అందుతోంది.

Advertisement

ఇంగ్లీష్( English ) సులువుగా నేర్చుకునేలా శివ రాసిన బుక్స్ అమెజాన్ లో బెస్ట్ సెల్లర్ బుక్స్ గా చోటును సొంతం చేసుకున్నాయి.నేర్చుకున్న విద్యను పది మందికి పంచుతున్న శివను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.లక్షల జీతాన్ని వదులుకుని విద్యార్థుల జీవితాలను మార్చే మంచి మనస్సు కొంతమందికే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో : కారులో రొమాన్స్ తో రెచ్చిపోయిన జంట..
Advertisement

తాజా వార్తలు