తెలంగాణలో పలువురు ఐపీఎస్‎ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐపీఎస్‎లకు బదిలీలతో పాటు పదోన్నతి కలిగింది.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ నియామకం అయ్యారు.ప్రస్తుతం డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు.

ప్రస్తుతం అంజనీకుమార్ అవినీతి నిరోధక విభాగం డీజీగా ఉన్న సంగతి తెలిసిందే.జనవరి 1 నుంచి తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా ఆయన విధులు నిర్వహించనున్నారు.

ఆయన స్థానంలో ఏసీబీ డీజీగా రవి గుప్తా నియమితులయ్యారు.సీఐడీ అదనపు డీజీగా మహేశ్ భగవత్, రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు