టాలీవుడ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా నటించిన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?

నటులు అన్నాక ఏ క్యారెక్టర్ ఇచ్చినా అవలీలగా చేయాలి.ఇది చేయను.

అది చేయను అని చెప్పకూడదు.

అలాగే ఒక్కొక్కసారి హీరో, హీరోయిన్ పెయిర్ అవ్వాల్సిన అవసరం లేదు.

కొన్ని సినిమాల్లో అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళల్లుగా కూడా చేయవచ్చు.ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నప్పుడు బాగా తెలిసిన హీరో, హీరోయిన్ ని మాత్రమే తీసుకుంటారు దర్శక నిర్మాతలు.

యాక్టర్స్ కూడా కేవలం ప్రొఫెషన్ ని ప్రొఫెషన్ లాగే చూడాలి.చూస్తారు కూడా.

Advertisement

టాలీవుడ్ లో ఇప్పటి వరకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా నటించి హీరో, హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్ బాబు- కీర్తి రెడ్డి

అర్జున్ సినిమాలె వీరిద్దరు కలిసి అక్కా తమ్ముడిలా నటించారు.

రాంచరణ్- కృతి కర్బందా

బ్రూస్ లీ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు.ఇందులో కృతి కర్బందా, రాం చరణ్ కి అక్కగా చేసింది.

రాజశేఖర్- మీరాజాస్మిన్

వీరిద్దరు కలిసి గోరింటాకు సినిమాలో నటించారు.ఇందులో రాజశేఖర్ కి మీరా జాస్మిన్ చెల్లిగా నటించింది.

సుధీర్ బాబు- సమంత

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
హాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ హీరోలను పక్కనపెట్టి తెలుగు హీరోల మీద దృష్టి పెడుతున్నారా..?

వీరిద్దరు ఏ మాయ చేసావే సినిమాలో యాక్ట్ చేశారు.ఇందులో సుధీర్ బాబు, సమంతకి అన్నగా నటించాడు.

బాలకృష్ణ- దేవయాని

Advertisement

వీరిద్దరు చెన్నకేశవరెడ్డి అన్నా చెల్లిగా నటించారు.

మంచు విష్ణు - కాజల్ అగర్వాల్

మోసగాళ్లు సినిమాలో విష్ణు , కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెళ్లుగా చేశారు.

శ్రీహరి- త్రిష

నువ్వొస్తానంటే నేనొద్దంటానా.కింగ్ సినిమాల్లో వీరిద్దరు అన్నాచెల్లెళ్లుగా నటించారు.

పవన్ కళ్యాణ్- సంధ్య

అన్నవరం సినిమాలో వీరిద్దరు అన్నాచెల్లెళ్లుగా నటించారు.

ఉపేంద్ర- నిత్యమీనన్

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్రకి నిత్యమీనన్ చెల్లెలి చేసింది.

చిరంజీవి- ఖుష్బూ

స్టాలిన్ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు.ఇందులో ఖుష్బూ చిరంజీవికి అక్కగా చేసింది.

అల్లరి నరేష్- కార్తీక

వీరిద్దరూ బ్రదర్ అఫ్ బొమ్మాళి సినిమాలో నటించారు.ఇందులో వీరు ట్విన్స్ గా యాక్ట్ చేశారు.

నితిన్-సింధు తులాని

ఇష్క్ సినిమాలో వీరిద్దరు అక్కా తమ్ముడిగా నటించారు.

తాజా వార్తలు