తెలంగాణ ఎంపీ స్థానాలపై బీజేపీ ఆశలు.. క్యూ కట్టేస్తున్న అగ్ర నేతలు 

తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకోవాలనే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) బిజెపి అధికారంలోకి రాకపోవడం, ఆశించిన స్థానాలు దక్కకపోవడం వంటివి బిజెపిని బాగా నిరాశకు గురిచేసినా.

ఎంపీ స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను దక్కించుకుంటాము అనే నమ్మకంతో బిజెపి అగ్రనేతలు ఉన్నారు.అందుకే 17 స్థానాల పైనా పూర్తిస్థాయిలో బిజెపి అగ్రనేతలు ఫోకస్ చేశారు.

ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు.బిజెపి అగ్ర నేతలు ఒకరి తరువాత మరొకరు తెలంగాణలో పర్యటిస్తూ, బిజెపి ప్రభావాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Advertisement

తెలంగాణ లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ) తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.కాగజ్ నగర్ , నిజామాబాద్, హైదరాబాద్ సభల్లో ఆయన  పాల్గొన్నారు.

ఈరోజు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిలతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమాలై,( Annamalai ) తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఈరోజు ఉదయం జరిగిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు.

ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు చౌటుప్పల్ సభకు హాజరై ప్రసంగిస్తారు.

అక్కడ నుంచి నల్గొండ వెళ్లి మూడు గంటలకు జరగబోయే బహిరంగ సభలో పాల్గొంటారు.అలాగే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ( Uttarakhand CM Pushkar Singh )కూడా ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు.పది గంటలకు ముషీరాబాద్ లోని యువ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

సినిమా బడ్జెట్ 600 కోట్లు తిరిగేదేమో 10 లక్షల కారు.. నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడుతున్న ఎన్టీయార్...

బిజెపి నిర్వహించే సభకు హాజరై ప్రసంగిస్తారు.రాజస్థాన్ సీఎం భజనలాల్ శర్మ సైతం తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Advertisement

సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ లోని ప్రవాసీ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమాలై కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ పరిధిలోని జమ్మికుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

అక్కడ నుంచి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి వెళ్తారు.అక్కడ మధ్యాహ్నం మూడు గంటలకు జరగబోయే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

సాయంత్రం సికింద్రాబాద్ పరిధిలోని సనత్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

తాజా వార్తలు