ఎక్కువ మైలేజీ.. తక్కువ ధరకే.. ఇండియాలో బెస్ట్ బైక్స్ ఇవే

బైక్స్( Bikes ) అంటే యువతకు మహా క్రేజ్.మంచి కొత్త కొనుగోలు చేయాలని ఆశ పడుతూ ఉంటారు.

ఇక కొంతమంది యువత స్పోర్ట్స్ బైక్ లు కొనుగోలు చేసి రైడింగ్ చేస్తూ ఉంటారు.రైడింగ్ ను ఎంజాయ్ చేసేవారు స్పోర్ట్ బైక్ లను కొనుగోలు చేస్తూ ఉంటారు.

అలాగే సాధారణ ప్రయాణాల కోసం ఉపయోగించుకునేవారు మంచి మైలేజ్, తక్కువ మెంటేనన్స్ వచ్చే బైక్ లను ఎంచుకుంటారు.సాధారణ ప్రజలైతే తక్కువ ధరలో వచ్చే బైక్ లను కొనుగోలు చేస్తారు.

ఇండియాలోనే తక్కువ ధరలు లభించే 5 బెస్ట్ బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Top 5 Best Bikes In India With Less Price And Gives More Mileage Details, High M
Advertisement
Top 5 Best Bikes In India With Less Price And Gives More Mileage Details, High M

ఇండియాలోనే తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ వచ్చే స్టాండర్ట్ ఫీచర్స్ బైక్స్ చాలా ఉన్నాయి.ఈ బైక్స్ అన్ని నగరాలు, పట్టణాల్లో లభిస్తాయి.బజాజ్ ప్లాటినా 100 బైక్( Bajaj Platina 100 ) తక్కువ ధరకు రావడంతో పాటు మైలేజ్ కూడా బాగా వస్తుంది.

బైక్ సిగ్నేచర్ టీడీఎస్ 1 టెక్నాలజీతో 102సీసీ ఇంజిన్ ఆధారంగా శక్తిని పొందుతుంది.ఈ బైక్ ధర రూ.67,475గా ఉంది.ఇక హోండా షైన్ 100 బైక్( Honda Shine 100 ) విషయానికొస్తే.

దీనికి ఆటో చోక్ సిస్టమ్ అండ్ సైడ్ ఇంజిన్ కంట్ ఆఫ్ వంటి స్విచ ్ఉంది.ఈ బైక్ ధర రూ.64,900గా ఉంది.ఇక టీవీఎస్ స్పోర్ట్ బైక్( TVS Sport Bike ) కూడా తక్కువ ధరకే వస్తుంది.దీని ధర రూ.61 వేలుగా ఉండగా.8.3 హెచ్ పి అండ్ 8.7 ఎన్‌ఎమ్ టార్క్ ఉంటుంది.

Top 5 Best Bikes In India With Less Price And Gives More Mileage Details, High M

ఇక హీరో మోటోక్రాప్ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్( Hero HF Deluxe ) 100 సీసీ విభాగంలో మంచి బైక్ అని చెప్పవచ్చు.డీలక్స్ i3s స్టాప్ స్టార్ట్ టెక్నాలజీతో ఉంటుంది.అనేక వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుంది.దీని ధర రూ.61 వేల నుంచి రూ,.68 వేల వరకు ఉంటుంది.ఇక హీరో హెచ్‌ఎఫ్ 100 మోడల్ బైక్ ను ఇండియాలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు.8 హెచ్‌పీ అండ్ 8.05ఎన్‌ఎమ్ హెచ్‌ఎఫ్ డీలక్స్ లాగే 97 సీసీ ఇంజిన్ ఉంటుంది.దీని ధర రూ.54,692గా ఉంది.

డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..
Advertisement

తాజా వార్తలు