ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహాలతో సిద్ధం కావడం జరిగింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీ చేయనుండగా జనసేన.తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారం విషయంలో అధికారంలో ఉన్న వైసీపీ చాలా ముందంజలో ఉంది.ఇక తెలుగుదేశం మరియు జనసేన పార్టీల నేతలు సీట్ల సర్దుబాటు అదేవిధంగా ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో పై చర్చలు జరుపుతున్నారు.
ఇటీవలే లోకేష్ “యువగళం” పాదయాత్ర( Yuvagalam ) ముగింపు సభలో పవన్ చంద్రబాబు పాల్గొన్నారు.
దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై పవన్( Pawan Kalyan ) చంద్రబాబు( Chandrababu Naidu ) కనిపించడంతో తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలలో ఫుల్ జోష్ నెలకొంది.ఇదిలా ఉంటే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్( CM Jagan ) రాష్ట్రంలో “ఆడుదాం ఆంధ్రా”( Aadudam Andhra ) కార్యక్రమం చేపట్టడానికి రెడీ కావడం జరిగింది.ఈ సందర్భంగా డిసెంబర్ 26వ తారీకు గుంటూరు జిల్లా నల్లపాడు లోని లయోలా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో క్రీడాజ్యోతిని వెలిగించి సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
అనంతరం శాప్ జెండా, జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.రేపటినుండి ఫిబ్రవరి 10వ తారీకు వరకు జరగనున్న ఈ కార్యక్రమం కోసం దాదాపు 34.19 లక్షల మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.