స్టోరీలు సేమ్.. హీరోలు మాత్రం డిఫరెంట్.. అయినా బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించారు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సేమ్ స్టోరీతో రెండు, మూడు సినిమాలు రావడం సర్వసాధారణం.

కొన్ని సినిమాలయితే 95% వేరే సినిమా స్టోరీతో వచ్చి సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ కూడా అయ్యాయి.

సేమ్ టు సేమ్ స్టోరీలతో వచ్చిన ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

• సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు

1999లో వచ్చిన యాక్షన్ డ్రామా ఫిల్మ్ "సమరసింహారెడ్డి"( Samarasimha Reddy ) ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే.

దీన్ని బి.గోపాల్ డైరెక్ట్ చేశాడు.నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అంజల జవేరి, సిమ్రాన్, సంఘవి ప్రధాన పాత్రలు పోషించారు.

ఇందులో హీరో కింగ్ లాంటి లైఫ్ వదిలేసి సాధారణ వ్యక్తిగా జీవిస్తాడు.బి.గోపాల్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఇంద్ర (2002) సినిమా( Indra ) కూడా సేమ్ స్టోరీతో వచ్చింది.ఈ సినిమాలో చిరంజీవి, ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే నటించారు.

Advertisement
Tollywood Similar Movies Samarasimha Reddy Narasimha Naidu Indra Kgf Pushpa Deta

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇందులో హీరో ప్రజలకు నీటిని అందించాలనే ఉద్దేశంతో తనకు నచ్చని మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధమవుతాడు.

అంతేకాదు రాజు లాగా బతికే అవకాశం ఉన్నా ప్రజల కోసమే ఊరు కాని ఊరు వచ్చి టాక్సీ డ్రైవర్ గా మారతాడు.ఇక నరసింహనాయుడు( Narasimha Naidu ) సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటించాడు.

సిమ్రాన్, ప్రీతి ఝాంగియాని, ఆశా సైనీలు ఫిమేల్ లీడ్‌ రోల్స్ పోషించారు.ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

ఈ మూవీ స్టోరీ చూసుకున్నా ఇంద్ర, సమరసింహారెడ్డి లాగానే ఉంటుంది.

Tollywood Similar Movies Samarasimha Reddy Narasimha Naidu Indra Kgf Pushpa Deta
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

• కేజీఎఫ్, పుష్ప

ఈ రెండు సినిమా స్టోరీలు కూడా సేమ్ ఉంటాయి అంటే నమ్ముతారా? పుష్ప( Pushpa ) మూవీలో అల్లు అర్జున్ కూలీ వాడి లెవెల్ నుంచి సిండికేట్ అవుతాడు.కేజీఎఫ్( KGF ) సినిమాలో హీరో యష్ కూలీ వాడి నుంచి కేజీఎఫ్ కింగ్ అవుతాడు.ఇద్దరి జర్నీ కూడా సేమ్-టు-సేమ్ ఉంటుంది.

Advertisement

ఇద్దరి క్యారెక్టర్జేషన్ కూడా పవర్ ఫుల్‌గా ఉంటుంది.అమ్మ సెంటిమెంట్ కూడా రిపీట్ అవుతుంది.

• బాహుబలి, జయం మనదేరా

ఈ రెండు సినిమాలను మూడు నాలుగు సార్లు చూస్తే బాహుబలి,( Baahubali ) జయం మనదేరా( Jayam Manadera ) స్టోరీలు కూడా సేమ్ కదా అనిపిస్తుంది.కాకపోతే బాహుబలిలో గ్రాఫిక్స్ బాగా చూపించారు.

• గుడుంబా శంకర్, ఆట

ఈ రెండు సినిమాల్లో హీరో విలన్స్ ఇంటికి వెళ్లి హీరోయిన్లను పెళ్లి చేసుకుంటారు.ఈ సినిమా స్టోరీలు 99% సేమ్ అని చెప్పవచ్చు.

• గ్రీకువీరుడు, సుకుమారుడు

నాగార్జున హీరోగా వచ్చిన గ్రీకువీరుడు,( Greeku Veerudu ) ఆది సాయికుమార్ కథానాయకుడిగా వచ్చిన సుకుమారుడు( Sukumaarudu ) సినిమాల స్టోరీలు సైతం సేమ్ ఉంటాయి.ఈ మూవీలో హీరోలు ఆస్తి కోసమే ఇండియాకు వస్తారు.కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కి బానిసలు అయిపోతారు.

• కృష్ణ వ్రింద విహారి, అంటే సుందరానికీ

ఈ రెండు సినిమాలు కూడా సేమ్ స్టోరీలతో వచ్చాయి.ఇందులో హీరోలు బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు.కానీ వేరే కులం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.

తర్వాత వారు పడిన బాధలన్నీ కూడా ఇందులో ఒకే లాగా చూపించారు.

తాజా వార్తలు