ఒక బడా నిర్మాత ధన దాహానికి బలైపోయిన దర్శకుడు కొడుకు?

సినిమా లోకం.ఓ రంగుల ప్రపంచం.

ఎంతోమంది ఔత్సాహికులు తన కలలను సాకారం చేసుకోవడానికి ఆ ప్రపంచంలోకి అడుగు పెడతారు.

అయితే అక్కడ అందరూ అనుకున్నంత సాఫీగా జీవితం ఉండదు.

ఈరోజు మనకి స్టార్ దర్శకులుగా పేరుగాంచిన వ్యక్తులు ఒకప్పుడు నానా ఇబ్బందులు పడినవారే.అదేవిధంగా ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లుగా పేరు గడించినవారు, నేడు నామరూపాలు లేకుండా పోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

Tollywood Producer Money Hungry , Director Teja, Tollywood Producer Money, Dire

దర్శకుడు తేజ( Director Teja ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.చిత్రం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ దర్శకుడు అనతి కాలంలోనే గొప్ప దర్శకుడుగా పేరు సంపాదించుకున్నాడు.చిత్రం తర్వాత ఆయన వరుసగా జయం, నిజం, నువ్వు నేను, లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి.

Advertisement
Tollywood Producer Money Hungry , Director Teja, Tollywood Producer Money, Dire

ఇలా అనేక సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రను వేసుకున్నాడు.కానీ అదే తేజ జీవితం వడ్డించిన విస్తరి కాదు అని మీలో ఎంతమందికి తెలుసు? ఎంతోమంది నిర్మాతలకు సూపర్ హిట్లు ఇచ్చిన తేజ, ఒక నిర్మాతకు మాత్రం శత్రువు అయ్యాడు.సర్వం కోల్పోయాడని మీకు తెలుసా.

Tollywood Producer Money Hungry , Director Teja, Tollywood Producer Money, Dire

ఒకనాడు దర్శకుడు తేజ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒక నిర్మాత ధన దాహం వలన తన బిడ్డను కోల్పోయిన ఘటనను చెప్పుకొని కుమిలిపోయాడు.అసలు విషయం లోకి వెళితే.తెలుగు పరిశ్రమలోని ఒక బడా నిర్మాత ఆయన జీవితంతో ఎలా ఆడుకున్నాడు అనే విషయం చెబుతూ వాపోయాడు.

సరిగ్గా అప్పుడు తేజ రెండో కొడుకుకి అనారోగ్యం కారణంగా సినిమా చేయలేని పరిస్థితి.ఆ సో కాల్డ్ సినిమా నిర్మాత అప్పటికే తేజాకు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు.

కానీ తేజ పరిస్థితి వేరే ఉంది.తన అబ్బాయిని చూసుకోవలసిన పరిస్థితి.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

దాంతో సినిమా చేయడానికి టైం పడుతుందని సదరు నిర్మాతకు చెప్పగా.ఇచ్చిన కోటి రూపాయలు తిరిగి వెనక్కి ఇచ్చేయమని అడిగాడు.

Advertisement

దాంతో దర్శకుడు తేజ.ఈ కష్టకాలంలో నన్ను ఇబ్బంది పెట్టకండి.మా అబ్బాయికి బాగోలేదు.

సినిమాను ఓ నెల రోజులు వాయిదా వేద్దాం అని చెప్పాడట.కానీ సదరు నిర్మాత వినకపోగా తేజ పై కేసు వేశాడట.

ఈ క్రమంలో ఒకవైపు తన కొడుకు బాగోగులు చూసుకోలేక, వైపు నిర్మాత పెట్టిన బాధలను భరించలేక.ఆఖరికి కన్న కొడుకుని కోల్పోయాడట! ఇంతటి దారుణమైన విషయానికి గల కారకుడు ఎవరనే విషయం మాత్రం తేజ వెల్లడించకపోవడం గమనార్హం!.

తాజా వార్తలు